విశాఖ: ఏపీలో వామపక్షాలు టీడీపీకి తోక పార్టీలని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మధురవాడ భూ వ్యవహారంలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మధురవాడ భూ వ్యవహారంలో తన అల్లుడికి భాగస్వామ్యం లేదని తెలిపారు. ఏపీలో ఏది జరిగినా వైసీపీకి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిని క్షేమించమని విజయసాయి హెచ్చరించారు. ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ భాగోతం బయటపెడతామని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఖజానాకు గండిపడేలా టీడీపీ వ్యవహరించిందని, అసత్య ఆరోపణలు చేసినవారందరికీ నోటీసులు ఇస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి