అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు

ABN , First Publish Date - 2020-10-29T06:29:32+05:30 IST

జిల్లాలోని ప్రతి పంచాయతీలోని వీధులన్నింటికీ ఎల్‌ఈడీ లైట్ల వెలు గులు అందేలా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా పంచా యతీ అధికారి సురేష్‌మోహన్‌ తెలిపారు

అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు

ప్రతి వెయ్యి లైట్లకు ఒకరితో పర్యవేక్షణ

జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌


నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబరు 28: జిల్లాలోని ప్రతి పంచాయతీలోని వీధులన్నింటికీ ఎల్‌ఈడీ లైట్ల వెలు గులు అందేలా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా పంచా యతీ అధికారి సురేష్‌మోహన్‌ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పంచాయతీ అధికారి కార్యాలయం లో ఎల్‌ఈడీ లైట్లు పంపిణీ చేస్తున్న ఈఈఎస్‌ఎల్‌ కం పెనీతో జిల్లా పంచాయతీ అధికారి ఒప్పందం చేసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఈ ఎస్‌ఎల్‌ కంపెనీ గ్రామ పంచాయతీలకు ఎల్‌ఈడీ లైట్లు పంపిణీ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని అందులో భాగంగా సదరు కంపెనీ జిల్లాలో కూడా ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చే యనుందని పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా 18,35,70,110,191 వాట్స్‌ ఎల్‌ఈడీ లైట్లను ప్రతి పంచాయతీకి అందజేయనున్నామన్నారు.


అన్ని గ్రామా ల్లో ఎల్‌ఈడీ లైట్లు అమర్చిన అనంతరం మండలానికి ఒక టెక్నికల్‌ మెకానిక్‌తో పాటు ప్రతి వెయ్యి లైట్లకు ఒకరిని సిబ్బందిగా నియమించి సదరు కంపెనీ పర్యవేక్షణ చేయనుందని తెలిపారు. జిల్లాలోని 461 గ్రామాల్లో ఎక్కడైనా లైట్లు పడకపోయినా, చెడిపోయినా 1,2రోజుల్లో సంబంధిత కంపెనీ అగ్రిమెంటు ప్రకా రం రిపేరు చేస్తారన్నారు. జిల్లాలోని దాదాపుగా అన్ని పంచాయతీల నుంచి ఎల్‌ఈడీ లైట్ల కోసం తీర్మానాలు అందాయన్నారు. ఈఈఎస్‌ఎల్‌ కంపెనీ ప్రతినిధులు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.    

Updated Date - 2020-10-29T06:29:32+05:30 IST