హిజాబ్‌ని తీసివేయమని అడిగినందుకు లెక్చరర్ రాజీనామా

ABN , First Publish Date - 2022-02-18T17:08:52+05:30 IST

హిజాబ్‌ని తీసివేయమని అడిగినందుకు కర్ణాటక రాష్ట్రంలోని ఓ మహిళా లెక్చరర్ తన ఉద్యోగాన్ని వదులుకుంది...

హిజాబ్‌ని తీసివేయమని అడిగినందుకు లెక్చరర్ రాజీనామా

బెంగళూరు: హిజాబ్‌ని తీసివేయమని అడిగినందుకు కర్ణాటక రాష్ట్రంలోని ఓ మహిళా లెక్చరర్ తన ఉద్యోగాన్ని వదులుకుంది.చాందిని అనే మహిళా లెక్చరర్ తుమకూరులోని జైన్ ప్రీ యూనివర్శిటీ కాలేజీలో ఇంగ్లీష్ బోధించేది. ఆమె గత మూడేళ్లుగా కాలేజీలో హిజాబ్ ధరిస్తూ పనిచేసేది. తన హిజాబ్‌ను తీసివేయమని కళాశాల ప్రిన్సిపాల్ కోరడంతో చాందినీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ‘‘మీ కాలేజీలో 3 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. నా హిజాబ్‌ను తీసివేయమని మీరు నన్ను డిమాండ్ చేసినందున నా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లెక్చరర్ పదవికి రాజీనామా చేస్తున్నాను’’ అని  కళాశాల ప్రిన్సిపాల్‌కి పంపిన రాజీనామా లేఖలో చాందినీ పేర్కొంది. ‘‘మత హక్కు అనేది రాజ్యాంగపరమైన హక్కు, దీనిని ఎవరూ కాదనలేరు... నేను మీ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తున్నాను’’ అని చాందిని రాసిన లేఖలో పేర్కొన్నారు. 




Updated Date - 2022-02-18T17:08:52+05:30 IST