అక్రమాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టం

ABN , First Publish Date - 2021-03-09T05:59:29+05:30 IST

ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డగోలుగా అవి నీతికి పాల్పడుతున్నారని.. రా బోయే రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వస్తే అక్ర మాలకు పాల్పడ్డ వారిని వదిలి పెట్టేది లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

అక్రమాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టం
మాట్లాడుతున్న మహేశ్వర్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

లక్ష్మణచాంద, మార్చి 8 : ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డగోలుగా అవి నీతికి పాల్పడుతున్నారని.. రా బోయే రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వస్తే అక్ర మాలకు పాల్పడ్డ వారిని వదిలి పెట్టేది లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం లక్ష్మణచాంద మండల యువతతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులను నడిరోడ్డుపై చంపినా.. రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇక సాధారణ జనం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. యు వత ఆశయ సాధన కోసం పోరాడుతానని, పేదలు, బడుగు బలహీ న వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉ న్న తెలంగాణను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షల కోట్ల లోటు బడ్జెట్‌లోకి నెట్టి అప్పుల తెలంగాణగా మార్చిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో టీఆ ర్‌ఎస్‌ నాయకులు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరిని అవలంబిస్తూ దేశ వ్యాప్తంగా రైతులందరినీ నష్టాల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేక, ఉపా ధి కల్పించడం చేతకాక యువతను రోడ్డు పాలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగం అంటే ఈ ప్రభుత్వాలకు గౌరవం లేకుండా పోయిందని, కోర్టు తీర్పు లను తుంగలో తొక్కేస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశా రు. నిర్మల్‌ నియోజకవర్గంలో సైతం అధికార పార్టీ ప్రజా ప్రతినిధు లు, నాయకులు.. అధికారులను బెదిరిస్తూ, అక్రమ ఆస్తులు సంపాది స్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అక్రమా లకు పాల్పడ్డ వారిని వదిలి పెట్టబోమన్నారు. కార్యక్రమంలో దిలావ ర్‌పూర్‌ జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, మామడ జడ్పీటీసీ సానియా సంతోష్‌, సోన్‌ ఎంపీపీ మానస హరీష్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ సరికెల గంగన్న, మాజీ వైస్‌ ఎంపీపీ ఒడ్నాల రాజేశ్వర్‌, మల్లాపూర్‌, నర్సా పూర్‌ సర్పంచ్‌లు అడిచెర్ల రవి కుమార్‌, లలిత జీవన్‌ రెడ్డి, పీచర, లక్ష్మణచాంద ఎంపీటీసీలు తిప్పని రాజేశ్వర్‌, గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బన్నెబోయిన పోశెట్టి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T05:59:29+05:30 IST