సంపాదిత సెలవులు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-05-16T07:00:29+05:30 IST

పదో తరగతి పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులందరికీ పారితోషికం నూతన పీఆర్సీ ప్రకారం ఇవ్వాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ కోరారు.

సంపాదిత సెలవులు ఇవ్వాలి
పరీక్షాపత్రాల మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ సాబ్జీ

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ

కాకినాడ రూరల్‌, మే 15: పదో తరగతి పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులందరికీ పారితోషికం నూతన పీఆర్సీ ప్రకారం ఇవ్వాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ కోరారు. కాకినాడ పీఆర్‌ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియను డీఈవో దాట్ల సుభద్రతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ మూల్యాకనం చేస్తున్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని ఒక్కో ఉపాధ్యాయుడికి రోజుకు 40 పేపర్లు మాత్రమే ఇవ్వాల న్నారు. ప్రత్యేక అసిస్టెంట్లకు పారితోషికం పెంచాలని, 55ఏళ్లు నిండిన వారికి స్పాట్‌ డ్యూటీ నుంచి రిలీవ్‌ చేయాలని కోరుతూ నేరుగా మూల్యాంకన కేంద్రం నుంచి ప్రభుత్వ పరీక్షల అధికారి దేవానంద్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన వెంట యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వర్మ, ప్రసాదరావు, నగేష్‌, ప్రసాద్‌, రమణ, నాగరాజు తదితరులున్నారు.


Updated Date - 2022-05-16T07:00:29+05:30 IST