దేవాలయాలలో అవినీతిని వదిలేయండి : ఎంపీ

ABN , First Publish Date - 2021-02-27T04:59:02+05:30 IST

టీఆర్‌ఎస్‌ నాయకులు కనీసం దేవాలయాల్లోనైనా అవినీతిని వదిలేయాలని ఎంపీ అర్వింద్‌ అన్నారు. శుక్రవారం ఆ ర్మూర్‌ సిద్దులగుట్ట ఘాట్‌రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు.

దేవాలయాలలో అవినీతిని వదిలేయండి : ఎంపీ
పనుల గురించి తెలుసుకుంటున్న ఎంపీ అర్వింద్‌

పెర్కిట్‌, ఫిబ్రవరి26: టీఆర్‌ఎస్‌ నాయకులు కనీసం దేవాలయాల్లోనైనా అవినీతిని వదిలేయాలని ఎంపీ అర్వింద్‌ అన్నారు. శుక్రవారం ఆ ర్మూర్‌ సిద్దులగుట్ట ఘాట్‌రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. ఘాట్‌రోడ్డు ఇ ప్పటికే పార్మేషన్‌ అయిందని, కొత్తగా 15రోజుల క్రితం శంకుస్థాపన చేశారని, టెండర్లు పిలిచారన్నారు. పార్మిషన్‌ అయిన రోడ్డుకు కొత్తగా టెండర్లు పిలవడమేమిటని ప్రశ్నించారు. నిర్మాణ వ్యయం విషయంలో సరియైన స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ప్రశ్నించారు. మున్సి పల్‌ కమిషనర్‌ శైలజను వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం సిద్దులగుట్ట శివాలయం, రామాలయాల్లో ఎంపీ అర్వింద్‌ శివలింగానికి అభిషేకం, హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఆ ర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.వినయ్‌రెడ్డి, బీజేపీ నాయకులు పుప్పా ల శివరాజ్‌, ప్రధానకార్యదర్శి జీవీ.నర్సింహరెడ్డి, జెస్సు అనిల్‌, నూతుల శ్రీనివాస్‌రెడ్డి, ద్యాగ ఉదయ్‌, మందుల బాలు, పాలెపు రాజు, కలిగోట ప్రశాంత్‌, ఆకుల రాజు, శీను, బీజేపీ నాయకులు ఉన్నారు.

Updated Date - 2021-02-27T04:59:02+05:30 IST