లెదర్‌పార్క్‌పై చిగురిస్తున్న ఆశలు

ABN , First Publish Date - 2020-08-04T10:17:15+05:30 IST

మందమర్రి పట్ట ణంలోని పాలవాగు ఒడ్డున 13 సంవత్సరాల క్రితం నిర్మించిన మిని లెదర్‌ పార్కు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు

లెదర్‌పార్క్‌పై చిగురిస్తున్న ఆశలు

ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

13 ఏళ్ళ క్రితమే మందమర్రికి మంజూరు

పూర్తయిన షెడ్డు నిర్మాణం

చర్మకార అభివృద్ధి సంస్థ కింద పలువురికి శిక్షణ


మందమర్రిటౌన్‌, ఆగస్టు 3 : మందమర్రి పట్ట ణంలోని పాలవాగు ఒడ్డున 13 సంవత్సరాల క్రితం నిర్మించిన మిని లెదర్‌ పార్కు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 6 జిల్లాల్లో  మిని లెదర్‌ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీని లో భాగంగానే చెన్నైలోని కేంద్ర లెదర్‌ పరిశోధన సీఎల్‌ఆర్‌ఐతో ఒప్పదం చేసుకొంది. దీంతో మందమర్రి లో నిర్మాణం చేపట్టి ప్రారంభించకుండా వదిలివేసిన లెదర్‌ పార్కుపై ఆశ లు చిగురిస్తున్నాయి.


ఈ పార్కు ఏర్పాటుకు సంబంధిం చి 148 సర్వే నెంబరులో 25 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అప్పటి కార్మిక మంత్రి జి. వినోద్‌  2007 ఫిబ్రవరి 1న పనులకు శంకుస్థాపన చేశా రు. రూ.25 లక్షల వ్యయంతో షెడ్డుతోపాటు బోర్‌వెల్‌ ఏర్పాటు చేశారు.  విద్యుత్‌ సరఫరా కోసం రామకృష్ణ పూర్‌ పట్టణానికి మంజూరైన 13/11కేవీ సబ్‌స్టేషన్‌ను లెదర్‌ పార్కు కోసం తరలించారు. ఈ లెదర్‌ పార్కు పనులు వేగవంతంగా ప్రారంభమైనా షెడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభించకుండానే వదిలివేశారు.  లెదర్‌ పార్కు ప్రారంభిస్తే దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. 


250 మందికి శిక్షణ 

చర్మకార అభివృద్ధి సంస్థ కింద చాలా మంది చెప్పు లు కుట్టేవారికి శిక్షణ కూడా ఇచ్చి సర్టిఫికెట్లు మంజూరు చేసింది. 40 అధునాతన మిషన్‌లతో చెప్పులు, షూలు, బ్యాగులు తయారు చేయడానికి స్ధానికంగా 250 మం దికి వృత్తి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం మినీ లెదర్‌ పార్కుల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు భాగ స్వామ్యంతో ఏర్పాటు చేయాలని యోచిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. మంద మర్రిలో ఏర్పాటు చేసిన లెదర్‌ పార్కు షెడ్డును కొంత ఆధునీకరించి ప్రారంభిస్తే వెంటనే తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చర్మకారులు, చెప్పులు కుట్టేవారు పేర్కొంటున్నారు.  

Updated Date - 2020-08-04T10:17:15+05:30 IST