కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు అవసరం

ABN , First Publish Date - 2021-06-20T04:58:31+05:30 IST

ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేందుకు కౌలు రైతులకు సీసీఆర్‌(క్రాప్‌ కల్టివేషన్‌ రైట్స్‌) కార్డులు అవసరమని వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోటేశ్వరరావు తెలిపారు.

కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు అవసరం
ఆరిపాకలో రైతులకు ఖరీఫ్‌ విత్తనాలు పంపిణీ చేస్తున్న కోటేశ్వరరావు

సబ్బవరం, జూన్‌ 19 : ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేందుకు కౌలు రైతులకు సీసీఆర్‌(క్రాప్‌ కల్టివేషన్‌ రైట్స్‌) కార్డులు అవసరమని వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోటేశ్వరరావు తెలిపారు. మండలంలోని ఆరిపాక గ్రామంలో శనివారం సీసీఆర్‌ కార్డులపై కౌలు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కలిగిన రైతు తన భూమిని కౌలుకు ఇచ్చినప్పటికీ భూ యజమానికి ఎటువంటి నష్టం లేకుండా 11 నెలల కాలపరిమితికి  మాత్రమే కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తుందన్నారు. ఈ కార్డుల ద్వారా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, రైతు భరోసా పథకం లబ్ధి పొందవచ్చన్నారు. సర్పంచ్‌ పాలిశెట్టి పార్వతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేశ్‌, పీఏసీఎస్‌ ఉపాధ్యక్షుడు బొడ్డేటి మహాలక్ష్మీనాయుడు, మల్ల కోటేశ్వరరావు, ఏఈవో బాలరాజు, వీఏఏ అపర్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T04:58:31+05:30 IST