లీకేజీలను పట్టించుకోరా?

ABN , First Publish Date - 2020-11-29T06:04:48+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా కృషి చేస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రభుత్వం విమర్శలకు గురవుతోందని ఎంపీపీ పంద్రజైవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీలు గ్రామీణ నీటి పారుదల శాఖ అఽధికారులను నిలదీశారు.

లీకేజీలను పట్టించుకోరా?
అధికారులను నిలదీస్తున్న, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు

ఉట్నూర్‌ మండల సమావేశంలో అధికారుల నిలదీత 

ఉట్నూర్‌, నవంబరు 28: రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా కృషి చేస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రభుత్వం విమర్శలకు గురవుతోందని ఎంపీపీ పంద్రజైవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీలు గ్రామీణ నీటి పారుదల శాఖ అఽధికారులను నిలదీశారు. మండలకేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ పంద్రజైవంత్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ గతంలో జరిగిన సమావేశాలలో చర్చించిన అంశాలపై వివిధ శాఖల అధికారులు స్పం దించడం లేదన్నారు. సమావేశంలో చర్చించిన విషయాలను ఏ మేరకు పరిష్కరించారో లిఖితపూర్వకంగా సభ్యులకు తెలపాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. సమావేశానికి ఐసీడీఎస్‌, ట్రాన్స్‌కో, అటవీ శాఖ, విద్యాశాఖ అధికారులు  గైర్హాజర్‌ అయ్యారు. మండల ఏఈ క్రాంతికుమార్‌, ఏఈ సాయికిరణ్‌ మాట్లాడుతూ మండలంలోని 37పంచాయతీలలో 191 గ్రామా లు ఉన్నాయని. 145 వోహెచ్‌ఆర్‌లు మంజూరు కాగా, 135 పూర్తి అయ్యాయని తెలుపగా.. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలతో పాటు ఎంపీటీసీలు జాదవ్‌ గోపాల్‌రావు, సీపతి సాయికృష్ణగౌడ్‌, శారద, సర్పంచ్‌లు గుండాల మల్లిక, పెందూర్‌ కళావతి మాట్లాడుతూ లీకేజీలు ఉన్న పట్టించుకొనే వారు కరువైపోతున్నారని విమర్శించారు. అధికారులకు ఫోన్‌లు చేసిన స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం గ్రామాలలో  పల్లెప్రగతి పథకం ద్వారా  పాత బావులను మూసి వేసినందున గ్రామాలలో బోర్లకు మరమ్మతులు చేయడానికి, మోటార్లు భిగించడానికి అధికారులు ఒప్పుకోకపోతే ప్రజలకు మంచినీళ్లు ఎలా అందిస్తామని  ప్రశ్నించారు. రూ.వెయ్యి వరకు పంచాయతీ నిధుల ద్వారా ఖర్చు చేసుకోవచ్చని ఏఈ క్రాంతి అన్నారు. ఇందులో ఏవో గణేష్‌, డా.అనురాధ, వెటర్నరి డా.రమే్‌షరాథోడ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T06:04:48+05:30 IST