Abn logo
Jul 25 2021 @ 00:31AM

12 గ్రామాల ‘దారి’ద్య్రం!

నక్కపల్లి- ఉపమాక- రాజయ్యపేట ప్రధాన రహదారి దుస్థితి

  ప్రమాదకరంగా నక్కపల్లి- రాజయ్యపేట ప్రధాన రహదారి

 ఎక్కడికక్కడ గోతుల మయం

 రాకపోకలకు జనం తీవ్ర ఇబ్బందులు 

  ప్రస్తుత వర్షాలతో మరింత నరకం

నక్కపల్లి, జూలై 24 : దశాబ్దాలు గడుస్తున్నా.. ఎందరో పాలకులు మారుతున్నా.. నక్కపల్లి నుంచి ఉపమాక మీదుగా రాజయ్యపేట వెళ్లే ప్రధాన రహదారి దశ మారడం లేదు. ఫలితంగా ఈ రహదారిపై ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. గజానికో గొయ్యి పడడంతో ఇంటి నుంచి బయల్దేరే వారు గమ్యం చేరే వరకు గండమే. దీనికితోడు ప్రస్తుతం కురుస్తున్న వర్షా లతో ఆ నీరు గోతుల్లో చేరుతుండడం వల్ల రహదారి ఎక్కడ బాగుందో.. ఎక్కడ గొయ్యిందో గుర్తించడం సాధ్యం కావడం లేదు.  నక్కపల్లి నుంచి  ఉపమాక మీదుగా రాజయ్యపేట వరకూ సుమారు నాలుగు కిలో మీటర్ల పొడవున ప్రధాన రహదారి ఉంది. సుమారు 12 గ్రామాల ప్రజల రాకపోకలు సాగించే ఈ రహదారికి గత మూడు సంవత్సరాలుగా మరమ్మతులు చేపట్టడాన్ని అధికారులు విస్మరించారు. ఫలితంగా మరింత అధ్వా నంగా తయారైంది. రాజయ్యపేట గ్రామంలో కూడా రహదారి భారీ గోతులతో కనిపిస్తోంది.