పార్టీ పటిష్టతకు నేతలు, కార్యకర్తలు కృషిచేయాలి

ABN , First Publish Date - 2022-06-30T05:58:30+05:30 IST

పార్టీ పటిష్టతకు నేతలు, కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం మండలంలోని కొండకర్ల ఆవ వద్ద బుధవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంటా మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో పార్టీ ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా, అంతా కలిసికట్టుగా అభ్యర్థి విజయానికి కృషిచేయాలన్నారు.

పార్టీ పటిష్టతకు నేతలు, కార్యకర్తలు కృషిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా, పాల్గొన్న నేతలు

మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

కొండకర్ల ఆవలో విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం   

అచ్యుతాపురం, జూన్‌ 29: పార్టీ పటిష్టతకు నేతలు, కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం మండలంలోని కొండకర్ల ఆవ వద్ద బుధవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంటా మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో పార్టీ ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా, అంతా కలిసికట్టుగా అభ్యర్థి విజయానికి కృషిచేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఆత్మస్థైర్యం కోల్పోకుండా నాయకులు, టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలన్నా రు. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు కొయిలాడ వెంకటేష్‌, అక్కిరెడ్డి జగదీష్‌ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, సీనియర్‌ నేత లాలం భాస్కరరావు, ఉత్తర ఇన్‌చార్జి విజయబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైల ముత్యాలనాయుడు, తెలుగు మహిళ రాష్ట్ర అధికార   ప్రతినిధి ఈతలపాక సుజాత, ఎన్‌ఆర్‌ఐ కృష్ణ, బొడ్డేపల్లి లలిత, జాన్‌, నరేష్‌, ప్రమీలారావు, కె.అప్పలనర్సమ్మ, సౌజన్యలక్ష్మి, లావణ్య, నియోజకవర్గం పరిధిలోని 17 వార్డుల అధ్యక్ష, కార్యదర్శులు, కార్పొరేటర్‌ అభ్యర్థులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:58:30+05:30 IST