చిన్న పట్టణాల్లోనూ దూసుకుపోతున్న ‘లీడ్’

ABN , First Publish Date - 2022-08-06T00:35:37+05:30 IST

ఎడ్యుకేషన్ సేవల సంస్థ ‘లీడ్’ (LEAD) చిన్నపట్టణాల్లో సైతం దూసుకెళ్తోంది. కాన్సెప్ట్‌లపై స్పష్టతనివ్వడంతోతోపాటు

చిన్న పట్టణాల్లోనూ దూసుకుపోతున్న ‘లీడ్’

హైదరాబాద్: ఎడ్యుకేషన్ సేవల సంస్థ ‘లీడ్’ (LEAD) చిన్నపట్టణాల్లో సైతం దూసుకెళ్తోంది. కాన్సెప్ట్‌లపై స్పష్టతనివ్వడంతోతోపాటు లోతైన అభ్యాసం, సకాలంలో సధన వంటి అవకాశాలను అందిస్తూ భావిభారత పౌరులను తయారుచేయడంలో తనవంతు పాత్ర పోషిస్తోంది. 2022 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చడం వెనక లీడ్ కృషి ఉంది. 127 మంది లీడ్ విద్యార్థులు 90 శాతానికి పైగా స్కోర్ సాధించగా, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణకు పట్టణంలోని  స్టెప్పింగ్‌ స్టోన్స్‌ స్కూల్‌ విద్యార్థిని ఎం.శిరీష 93.2 శాతం స్కోర్‌ చేయగలిగింది.


టయర్ 2 పట్టణాలతోపాటు ఆపై పట్టణాల్లోని పాఠశాలను కూడా లీడ్ సమూలంగా మారుస్తోంది.  లీడ్‌ ఇప్పటికే 25వేల మందికి పైగా ఉపాధ్యాయులకు నైపుణ్యం అందించడంతో పాటుగా లోతుగా పరిశోధించిన కరిక్యులమ్‌, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బోధన, సాంకేతిక పరిష్కారాల బోధన అందిస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో 1.4మిలియన్ల మందికి పైగా విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడంలో తోడ్పడింది.  లీడ్‌ లాంటి వ్యవస్థలతో  భారతదేశంలోని చిన్న పట్టణాలలోని విద్యార్థులు సైతం విద్యపరంగా మెట్రో నగరాల్లోని  విద్యార్థుల్లా మెరుగైన ఫలితాలను సాధించగలరని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని లీడ్ కో ఫౌండర్, సీఈవో సుమీత్ మెహతా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలకు అత్యాధునిక సీబీఎస్‌ఈ కరిక్యులమ్‌ను లీడ్‌ అందిస్తోంది. పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని  స్టేట్‌బోర్డ్‌ ప్రోగ్రాంలకు సైతం వినూత్నమైన కరిక్యులమ్‌ అందిస్తోంది. 

Updated Date - 2022-08-06T00:35:37+05:30 IST