వలస కార్మికుల కోసం ఎల్‌సీడీ టీవీ, యోగా ట్రైనర్

ABN , First Publish Date - 2020-04-03T22:23:13+05:30 IST

వలస కార్మికులు రాష్ట్రం దాటిపోకుండా కట్టుదిట్టంగా కాపలా కాస్తోంది హర్యానా ప్రభుత్వం. అయితే అక్కడితో...

వలస కార్మికుల కోసం ఎల్‌సీడీ టీవీ, యోగా ట్రైనర్

చండీఘర్: వలస కార్మికులు రాష్ట్రం దాటిపోకుండా కట్టుదిట్టంగా కాపలా కాస్తోంది హర్యానా ప్రభుత్వం. అయితే అక్కడితో ఆగకుండా వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటోంది. దీనికి స్థానిక ప్రజలు కూడా తమవంతు సాయం అందించడం విశేషం.


నాలుగు రోజుల క్రితం 65మంది వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయేందుకు రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ బయలుదేరారు. అయితే వారిని సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుని దగ్గరలోని ఓ గ్రామంలో షెల్టర్ హోం ఏర్పాటు చేసి అందులో ఉంచారు. 


తమ గ్రామంలో ఉన్న వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా, ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్రాంత వాసులు వారికోసం ఓ యోగా ట్రైనర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం మరింత ముందడుగు వేసి వారికి ఓ ఎల్‌సీడీ టీవీని అందించింది. దీనిపై ఓ వలస కార్మికుడు మాట్లాడుతూ, ఈ గ్రామ సర్పంచ్, ఇక్కడి ఉద్యోగులు తమకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటున్నారని, ఎప్పటికప్పుడు మా బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఏ ఒక్క కార్మికుడు షెల్టర్ హోంను వదిలి వెళ్లకుండా 8మంది పోలీసులను కూడా కాపలా పెట్టింది. 

Updated Date - 2020-04-03T22:23:13+05:30 IST