హైదరాబాద్: ఎల్బీనగర్ లో ఎస్.ఓ.టి పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను పట్టుకున్నారు. ఏవోబి నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కు అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్.ఓ.టి పోలీసులు తనిఖీలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.