వెంచర్లతో.. వంచన

ABN , First Publish Date - 2021-10-25T05:08:11+05:30 IST

సార్వత్రిక ఎన్నికలకు ముందు జోరుగా సాగిన రియల్‌ వ్యా పారం.. ఎన్నికల తర్వాత సద్దు మణిగింది. ఆ తర్వాత కొన్ని నెలల నుంచి మళ్లీ ఊపందుకుం ది.

వెంచర్లతో.. వంచన
ఓ అనధికారిక లేఅవుట్‌

  • నిబంధనలకు విరుద్ధంగా లేఔట్లు 
  • అక్రమార్కుల పంచన అధికారులు
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
  • అనుమతి లేకుండానే ప్లాట్ల విక్రయాలు
  • అనధికార లేఅవుట్లతో రియల్టర్లకు కాసులు
  • రియల్‌ మాయతో కొనుగోలుదారుల లబోదిబో


రియల్‌ మాయతో జనం మోసపోతున్నారు. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న భూ కొనుగోళ్లు.. విక్రయాలు గత కొన్ని నెలలుగా జోరందుకున్నాయి. ఇదే అదునుగా అక్రమ లేఅవుట్లతో రియల్‌ మాయగాళ్లు రంగంలోకి దిగారు. అనధికార వెంచర్లతో కొనుగోలుదారులకు గాలం వేస్తున్నారు. చుక్కల భూమి.. అనుమతిలేకుండా.. అనధికార వెంచర్లు ఇటీవల జోరందుకున్నాయి. జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి శివారు గ్రామాల వరకు వెంచర్లు వెలుస్తున్నాయి. వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు చివర్లో తాము మోసపోయామని తెలుసుకుని విలవిలలాడుతున్నారు. గ్రామాలలో రెవెన్యూ, పంచాయతీ అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా అనధికార లేఅవుట్‌లు వెలుస్తున్నాయి. వీటిని అదుపు చేయాల్సిన అధికారులు, ఉద్యోగులు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లలో గృహ నిర్మాణాల కోసం ప్రణాళికా విభాగం అధికారులను సంప్రదిస్తుంటే ప్లాన్‌ ఇవ్వడానికి కుదరదని చెబుతుండటంతో రియల్‌ మోసాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనధికార లేఅవుట్లు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు రెండు వందల గ్రామాలలో 500 అనధికార లేఅవుట్లు ఉన్నట్లు సమాచారం.

 

పైసలివ్వు.. ప్లాటేస్కో

అనధికార వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అక్రమార్కుల పంచన చేరిపోయారు. పైసలివ్వు ప్లాట్లు వేసుకో అన్న రీతిలో అధికారులు వ్వవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరైనా వ్యాపారి నిర్ణయించిన మేరకు లంచం ఇవ్వకుంటే నరసరావుపేట ప్రాంతంలో రాత్రికిరాత్రి ఆ వెంచర్‌ వద్ద ఇది అనుమతి లేని లేఅవుట్‌ అని బోర్డు వెలుస్తుంది. వారు నిర్ణయించిన రేటు చెల్లిస్తే బోర్డును వారే తొలగిస్తారనేది ఇక్కడ బహిరంగ రహస్యం. 


సీజ్‌లతో కాసులు

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ఎక్కువగా ఉన్న గ్రామాలలో పంచాయతీ అధికారులు ఆకస్మిక తనికీల పేరుతో జేబులు నింపుకుంటున్నారు. రికార్డులను సీజ్‌ చేసి అక్రమ లేఅవుట్లు అంటూ హడావుడి చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ప్లాట్ల ధరలను దృష్టిలో పెట్టుకొని రికార్డు ఇవ్వడానికి రూ.లక్షల్లో బేరాలు పెడుతున్నారు. గతంలో ఓ అధికారి రికార్డు తెచ్చారంటే రూ.లక్ష ఇవ్వాల్సిందనే నిబంధన పెట్టారని సమాచారం. 

 

విజిలెన్స్‌ కమిటీల ఏర్పాటు

రియల్‌ అక్రమాలను అదుపు చేయడానికి ప్రభుత్వం డివిజన్‌, జిల్లాస్థాయిలో విజిలెన్స్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. డివిజన్‌ స్థాయిలో ఈవోపీఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శి, పంచాయితీ జూనియర్‌ అసిస్టెంట్‌తో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనధికార లేఅవుట్లను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. ఇక జిల్లా స్థాయిలో జడ్పీ సీఈవో, డీపీవో, టౌన్‌కంట్రీప్లానింగ్‌ జిల్లా ఆఫీసర్‌తో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధానంగా గ్రామాలలో అనధికార లేఅవుట్లను అదుపు చేయటం, ఎక్కడైనా అనధికార లేఅవుట్లు ఉంటే వాటికి చట్టభద్ధత కల్పించడానికి ఈ కమిటీలు చర్యలు తీసుకోవాలి. గుంటూరు డివిజన్‌ విజిలెన్స్‌ కమిటీలో ఈవోపీఆర్‌డీ కె.శ్రీనివాసరావు (మంగళగిరి) నుదురుపాడు పంచాయతీ కార్యదర్శి జీవీఆర్‌కే మూర్తి, పొన్నెకల్లు పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌  కే శివరామ్‌లను నియమించారు. నరసరావుపేట డివిజన్‌కు పిడుగురాళ్ళ ఈవోపీఆర్‌డీ బీ శంకరరావు, గామాలపాడు పంచాయతీ కార్యదర్శి పీ విజయకుమార్‌, నాదెండ్ల పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ సీహెచ్‌ శివారెడ్డిలను,  తెనాలి డివిజన్‌కు తెనాలి ఈవోపీఆర్‌డీ వీ విజయలక్ష్మి, స్టూవర్టుపురం  పంచాయతీ కార్యదర్శి పీ అజయకుమార్‌, వేమూరు పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ సీహెచ్‌ నాగేశ్వరరావులను  నియమించారు.


లే అవుట్ల బ్లాక్‌

అక్రమాన్ని సక్రమం చేసుకోవాలంటూ అనుమతులు లేని లే అవుట్ల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలుపుదల చేసింది. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ లేఅవుట్‌ల సర్వే నంబర్లను గత మే నెల నుంచే బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. దీంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ర్టేషన్‌కు వెళుతున్న వారికి చుక్కెదురవుతోంది. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో పడిపోయాయి. పట్టణాలకు కొద్దిగా దూరంలో అయినా, తక్కువ రేటుకు వస్తే, కొనుగోలుచేసి వదిలేసి, రేటు పెరిగినప్పుడు అమ్ముకుందామనే ఆలోచన ఉన్నవారికి మాత్రం కొనుగోళ్లు, అమ్మకాలు జరగడంలేదు. తెనాలి పట్టణం, తెనాలి-విజయవాడ, తెనాలి-గుంటూరు, తెనాలి-చందోలు, తెనాలి-రేపల్లె మార్గంలో సుమారు 1100 ఎకరాల వరకు ప్లాట్లకు అనుమతులు లేవని సమాచారం. అక్రమ లేఅవుట్లను గుర్తించేందుకు కమిటీలను వేసి, వాటిపై నిర్ధారణకు వచ్చాక క్రమబద్ధీకరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  


విజిలెన్స్‌ కమిటీలతో హడావుడి

అనధికార లేఅవుట్లను గుర్తించడానికి విజిలెన్స్‌ కమిటీల పేరుతో అధికారులు హడావుడి చేస్తారు. ఈ కమిటీల వల్ల అధికారుల అక్రమ ఆదాయం పెరుగుతుంది తప్ప ప్రభుత్వానికి, కొనుగోలుదారులకు ప్రయోజనం ఉండదు.  గ్రామాల్లో అనధికార లేఅవుట్లకు చట్టభద్ధత కల్పిస్తే రూ.200 కోట్ల ఆదాయం వస్తుంది. లాండ్‌ కన్వ ర్షన్‌ చేయకుండా అపార్టుమెంట్లు నిర్మిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. -జాస్తి వీరాంజనేయులు, ఏపీ పంచాయతీ పరిషత్‌, చైర్మన్‌ 

 

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

సార్వత్రిక ఎన్నికలకు ముందు జోరుగా సాగిన రియల్‌ వ్యా పారం.. ఎన్నికల తర్వాత సద్దు మణిగింది. ఆ తర్వాత కొన్ని నెలల నుంచి మళ్లీ ఊపందుకుం ది. జిల్లాలో గుంటూరు, మున్సి పల్‌ పట్టణాలకు చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు పెరిగిపో యాయి. లోక్‌సభ నియోజకవర్గాలు జిల్లాలుగా మారుతున్నాయని ప్రచా రాలు జరుగుతున్నాయి. దీంతో బాపట్ల, నరసరావుపేట కేంద్రాలు జిల్లాలు ఏర్పాటవుతాయంటూ ఆయా ప్రాంతాల్లో వందలాది వెంచర్లు వెలిశాయి. ఇప్పుడు కొనుగోలు చేయకుంటే భవిష్యత్‌లో అటువైపు చూడలేమన్నట్లుగా రియల్‌ మాయగాళ్లు ప్ర చారాలు చేశారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టం వచ్చినట్లుగా భూములు కొనుగోలు చేసి లే అవుట్లు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం లే అవుట్‌ వేయాలంటే రెవెన్యూ, పంచాయతీ అధికారుల అనుమతి ఉండాలి. వ్యవసాయ భూములను ప్లాట్లు గా మారిస్తే ముందుగా ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయాలి. అ యితే చాలావరకు ఇలాంటి నిబంధనలు ఏమీ పట్టించుకోకుండానే వెంచర్లు వెలు స్తున్నాయి. అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోకుండా రియల్‌ వ్యాపారులు అధికారులను మా మూళ్లతో మౌనంగా ఉండేలా చే స్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టు కొచ్చిన వెంచర్లల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన కనీస ధ్రువ పత్రాలు లేకుండానే రూ.కోట్లలో వ్యాపారం సాగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమతమవుతున్నారనే విమర్శలున్నాయి.  రియల్‌ ఎస్టెట్లు వ్యాపారులు, బిల్డర్లు ఖర్చులు తగ్గించి ఆదా యాన్ని పెంచుకోవడానికి సమీపంలోని గ్రామాలను ఎంపిక చేసుకుని వెంచర్లు వేస్తున్నారు. అనధికార వెం చర్లు వేసే వారిలో అధికార పార్టీ నాయకులు కూడా ఉండటంతో వారిని అడ్డుకునే వారే లేకుండా పోతు న్నారని సమాచారం. అనధికార వెంచర్లలో అపార్ట్‌ మెంట్ల నిర్మాణాలు పూర్తి చేసి విక్రయించిన వాటికి ఇప్పటికీ అనుమతులు లేవంటే ఆశ్చర్యం కాదు. లక్షలు పోసి కొన్న స్థలానికి ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయించుకోవా లంటే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. గుం టూరు నగర పాలక సంస్థలో కలిసిన చుట్టుపక్కల గ్రా మాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం, లేఅవుట్లు పెద్దఎత్తున జరిగాయి. గ్రామాల్లో వేసే ప్రతి వెంచర్‌లో పంచాయ తీకి పదిశాతం భూమి ఇవ్వాలి. రోడ్లు, పాఠశాల, పా ర్కు, గ్రంఽథాలయం, కమ్యూనిటీ భవనం, మంచినీటి బోరు, ఇతర మౌలిక వసతులకు ఉచితంగా భూమి ఇచ్చి ఆ పంచాయతీకి రిజిస్ట్రేషన్‌ చే యాలి. 30 అడుగుల రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్‌, వీధి దీపాలకు ఈ భూమిని ఉపయో గించాలి.  జిల్లాలోని విజిలె న్స్‌ అధికారులు అనధి కార లేఅవుట్లపై అనేక నివేదికలి చ్చారు. వాటిని అమ లుచేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం 200 గ్రామాలలో సుమారు 500 అనధికార లే అవు ట్లు ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధి కారులు దృష్టికి వచ్చింది. వీటిపై చర్యలు తీసుకునే పరిస్థితిలేదు. రియల్‌ అక్రమాలను అడ్డుకునే వారు కరువైన నేపథ్యంలో కొనుగోలు దారులే అప్రమత్తంగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు. 

  - నరసరావుపేట జిల్లా కేంద్రం కాబోతుందన్న ప్రచారంతో రియల్‌ అక్రమాలు పెద్దఎత్తున జరిగాయి. స్థిరాస్తి లేఅవుట్ల ఏర్పాటుకు ఉన్న నిబంధనలును ఇక్కడ తుంగలో తొక్కుతున్నారు. వెంచర్లలో కాలువలు, వాగులు మాయమవుతున్నా పట్టించుకునే వారే లేకుం డా పోయారు. జిల్లా కేంద్రం పేరుతో పాలపాడు, రావి పాడు, వల్లప్పచెరువు, ఇస్సపాలెం, అగ్రహారం, ముల కలూరు ప్రాంతాల్లో పెద్దఎత్తున రియల్‌ వ్యాపారం జరి గింది. జిల్లా పేరుతో వచ్చిన బూమ్‌లో స్థలాలు కోను గోలు చేసిన వారు ప్రస్తుతం తీవ్రంగా నష్టపోయారు. లింగంగుంట్ల అగ్రహారం భూములకు కోర్టు ఉత్తర్వులు మేరకు రిజిష్ట్రేషన్లను ప్రభుత్వం నిషేధించింది. ఇక్కడ ప్లాట్లు కొన్నవారు లబోదిబోమంటున్నారు. 

  - రాజుపాలెం మండలం కొండమోడు, ఉప్పలపాడు, సమీపంలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. అనుమతిలేకుండానే వ్యవసాయ భూమిని ప్లాట్లుగా వేసి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. సత్తెనపల్లిలోని సుందరయ్యకాలనీ సమీపంలో, వడ్డవల్లి ప్రాంతంలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ల్యాండ్‌ కన్వర్షన్‌ పొందినప్పటికీ ఇతర ప్రభుత్వ అనుమతులు లేవు.  

- పొన్నూరు ప్రాం తంలో వ్యవసాయానికి అనువుగా లేని భూములు, రోడ్డు వైపు ఉన్న పంట భూములను నివేశన  స్థలాలుగా కన్వర్షన్‌ చేసుకుని రియల్టర్లు వెంచర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేటు సర్వేయర్లతో వెంచర్లు వేసి పాట్లు విక్రయాలు చేస్తున్నారు. పట్టణంలోని పెదఇటికంపాడురోడ్డు, కసుకర్రు రోడ్డు, 25 వార్డు భారత్‌ గ్యాస్‌ గోడౌను, నిమ్రామసీదు పక్కన, కట్టెంపూడి అడ్డరోడ్డు ప్రాంతాల్లో అక్రమ లేవుట్లు వెలిశాయి. టౌన్‌ప్లానింగ్‌ అఽధికారులు వాటిని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం.  

 - చిలకలూరిపేటలో మునిసిపల్‌ ప్రణాళికా విభాగం అధికారికంగా 27 అనధికార లేవుట్లను గుర్తించింది. యడ్లపాడు మండలంలో 15కి పైగా అనధికార లేఅవుట్లు ఉన్నాయి. మైదవోలు, చెంఘీజ్‌ఖాన్‌పేట, కోట, కొండవీడు పరిధిలో ఉన్నాయి. నాదెండ్ల మండలలో గణపవరం గ్రామ పరిధిలోని కుప్పగంజివాగు పక్కన సుమారు 8 ఎకరాలలో అనధికార లేఅవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్లు వేశారు. కనీసం కన్వర్షన్‌ కూడా కాలేదు. అయినా అమ్మకాలు చేస్తున్నారు.

- మాచర్లలో సాగర్‌ రోడ్డులో 2, సొసైటీ కాలనీలో 1, గుంటూరు రోడ్డులో 2, నెహ్రూనగర్‌లో 2 దాకా అనధికార లేఅవుట్లు ఉన్నాయి.  

- పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మండలాలకు సమీపంలో ఏడాది కాలంగా ప్రైవేటు వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి.    అధికారపార్టీ నాయకులు కొందరు ప్రభుత్వ అనుమతులు, ల్యాండ్‌ కన్వర్షన్‌ లేకుండానే ప్లాట్లు వేసేశారు. బ్రాహ్మణపల్లి సమీపంలో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాలకు అతి చేరువలో కొందరు వెంచర్లు వేశారు. ఇక్కడ చాలావాటికి అను మతులు లేవని సమాచారం.  పిడుగురాళ్ల పురపాలక సంఘం, సమీపంలో ఉన్న జానపాడులోనూ అక్రమ లేఅవుట్‌లను వేసేసి స్థలాలను విక్ర యించేస్తున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడంలేదు. అధికారులు మామూళ్లు తీసుకుని అక్రమ లేఅవుట్లను పట్టించుకోవడంలేదని ఇటీవల మున్సిపల్‌ సమావేశంలో కొందరు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 

Updated Date - 2021-10-25T05:08:11+05:30 IST