లేఅవుట్‌లు ఇలా.. నిర్మాణాలు ఎలా..?

ABN , First Publish Date - 2022-05-22T06:31:51+05:30 IST

అట్టహా సంగా వేసిన జగనన్న కాలనీ లేఅవు ట్‌లలో పలుచోట్ల మౌలిక సదు పాయాలు కరువయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఆయా లబ్ధి దారులు వెనుకడుగు వేస్తున్నారు.

లేఅవుట్‌లు ఇలా.. నిర్మాణాలు ఎలా..?
నాతవరానికి రెండు కి.మీ. దూరంలో వేసిన లేఅవుట్‌లో పెరిగిన తుప్పలు

 నాతవరం, గునుపూడి, జిల్లేడిపూడిలలో కనీస సౌకర్యాలు కరువు

 ఇళ్ల పనులు ప్రారంభించేందుకు లబ్ధిదారులు వెనుకడుగు

నాతవరం, మే 21 : అట్టహా సంగా వేసిన జగనన్న కాలనీ లేఅవు ట్‌లలో పలుచోట్ల మౌలిక సదు పాయాలు కరువయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఆయా లబ్ధి దారులు వెనుకడుగు వేస్తున్నారు. ఓవైపు త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్ట కుంటే పట్టాలు రద్దవుతాయని గృహ  నిర్మాణ విభాగం అధికారులు, గ్రామ వలంటీర్లు చెపుతున్నారని, కనీసం నీటి సౌకర్యమైనా లేని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు ఎలా సాధ్యమని వారంత ప్రశ్నిస్తున్నారు. మండలంలో వైసీపీ ప్రభుత్వం 56 లేఅవు ట్లను వేసింది. వీటిలో 2051 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ సెంటున్నర చొప్పున ఇంటి స్థలాన్ని ఇచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గునుపూడి, జిల్లేడిపూడిల్లో  గెడ్డలు, కొండప్రాంతాలు వద్ద లేఅవుట్‌లు వేశారని చెపుతు న్నారు. ఇవి ఇళ్ల నిర్మాణానికి అను వుగా లేవని తాము చెప్పడంతో ఎత్తు పల్లాలు లేకుండా అభివృద్ధి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా పట్టించుకోలేదని ఆరోపిస్తు న్నారు. అలాగే, మండల కేంద్రం నాతవరానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ధారగంగవరం సమీపంలో 195 మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చారు. ఇక్కడ కూడా లేఅవుట్‌ అభివృద్ధి చేయకపోవడంతో తుప్పలు పెరిగి పోయాయని ఆయా లబ్ధిదారులు అం టున్నారు. ఇక్కడ మూడు నెలల క్రితం బోరు వేసినప్పటికీ మోటరు మాత్రం నేటికీ బిగించలేదని వాపో తున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు ఒత్తిడి తెస్తే తమకు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఇక్కడ నిర్మా ణాలు ప్రారంభిస్తే రెండున్నర కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని, ఇది తమకు అదనపు భారం కానుందని అంటు న్నారు. అలాగే జిల్లేడిపూడిలో కూడా కొండప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చా రని అంటున్నారు. ముందుగా లేఅవు ట్‌లలో నీరు, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణానికి తామంతా సిద్ధంగా ఉన్నామని పలు వురు లబ్ధిదారులు చెపుతున్నారు. 

Updated Date - 2022-05-22T06:31:51+05:30 IST