ఇదిగో అక్రమ లేఅవుట్‌!

ABN , First Publish Date - 2022-05-19T04:36:22+05:30 IST

‘‘ఇదిగో అక్రమ లేఅవుట్‌.. దీనిపై సమాధానం చెప్పు..’’ అంటూ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌కు టీడీపీ నగర ఇనచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధారాలతో సహా సవాల్‌ విసిరారు.

ఇదిగో అక్రమ లేఅవుట్‌!
నిర్మాణంలో ఉన్న భవనాలను చూపుతున్న కోటంరెడ్డి

పెన్నా పొర్లుకట్ట స్థలంలో భవంతులు

బినామీల ద్వారా రూ.16 కోట్ల అక్రమ సంపాదన

దమ్ముంటే విచారణకు రా!

మాజీ మంత్రి అనిల్‌పై టీడీపీ నేత కోటంరెడ్డి ఆగ్రహం


నెల్లూరు, మే 18 (ఆంధ్రజ్యోతి) : ‘‘ఇదిగో అక్రమ లేఅవుట్‌.. దీనిపై సమాధానం చెప్పు..’’ అంటూ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌కు టీడీపీ నగర ఇనచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధారాలతో సహా సవాల్‌ విసిరారు. నెల్లూరులోని 4వ డివిజనలో పెన్నా పొర్లుకట్ట స్థలంలో వేసిన లేఅవుట్‌లో బుధవారం ఆయన పర్యటించారు. నాయకులు, మీడియాను వెంట బెట్టుకొని అక్కడ నిర్మాణాలు, కాలువల స్థలాల ఆక్రమణను రిజిసే్ట్రషన డాక్యుమెంట్లతో సహా వివరించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ 1.86 ఎకరాలకు మాత్రమే రిజిసే్ట్రషన ఉందని, దానికి అదనంగా మరో రెండు ఎకరాలను ఆక్రమించి లేఅవుట్‌ వేశారని ఆరోపించారు. అనిల్‌ బినామీ  4వ డివిజన కార్పొరేటర్‌ భర్త పొలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి ఈ లేఅవుట్‌ వేసి విక్రయించారని, దీనిద్వారా రూ.16 కోట్ల ప్రజా సొమ్మును కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. అనిల్‌ అవినీతి వ్యవహారాల్లో ఇది ఒక్కటే కాదని, ఇంకా 482 ఎకరాల్లో ఆయన భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. పెన్నా పొర్లుకట్టలను ఆక్రమించడం నేరమని తెలిసినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ అక్రమాలను చూస్తూ ఉన్న తహసీల్దార్‌, ఆర్డీవో, రిజిసా్ట్రర్‌తోపాటు ప్రోత్సహించిన అనిల్‌ కూడా నేరస్థులే అని అన్నారు. తన బినామీల అక్రమలేఅవుట్లను సక్రమం చేసేందుకు త్వరలో కొత్త జీవో తెస్తానని అనిల్‌ చెబుతున్నారని, నుడాకు అప్పగించవలసిన 12 శాతం స్థలానికి బదులుగా 7 శాతం స్థలానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని మాట్లాడుతున్నారని, దీనిపై పోరాటం చేస్తామని ప్రకటించారు. మూడేళ్లు మంత్రిగా ఉండి తనపై ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని, ఇప్పటికైనా దమ్ముంటే మన ఇద్దరిపై విచారణ జరిపించుకుందామని అనిల్‌కు సవాల్‌ విసిరారు. ఇప్పటికైనా కలెక్టర్‌ జోక్యం చేసుకొని పొర్లుకట్టలు, కాలువల స్థలాల ఆక్రమణపై విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. కోటంరెడ్డి వెంట టీడీపీ నాయకులు మామిడాల మధు, కువ్వారపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T04:36:22+05:30 IST