అది ఆమె మొదటి కేసు

ABN , First Publish Date - 2020-03-20T05:50:19+05:30 IST

ఎనిమిదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో నలుగురు నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేయడంలో న్యాయవాది సీమా సమృద్ధి కుష్వహ కీలకంగా వ్యవహరించారు.

అది ఆమె మొదటి కేసు

ఎనిమిదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో నలుగురు నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేయడంలో న్యాయవాది సీమా సమృద్ధి కుష్వహ కీలకంగా వ్యవహరించారు. అలాగనీ ఆమె పేరుమోసిన లాయర్‌ కాదు. ఆమెకు అదే తొలి కేసు. నిర్భయ కుటుంబంతో అనుబంధం ఉన్న సీమ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సవాల్‌గా తీసుకొని పక్కాగా 

సాక్ష్యాధారాలు సేకరించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా పలు కోణాల్లో అధ్యయనం చేసి కోర్టుకు తుది నివేదిక అందించారు. నిందితులకు శిక్ష పడేలా చేసి విజయం సాధించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దోషులకు ఉరిశిక్ష విధిస్తున్నట్టు తీర్పు చదివినప్పుడు కోర్టు ఆవరణలో సంబరాలు మొదలయ్యాయి. ఆ క్షణం నిర్భయ తల్లి ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. మొదటి కేసులోనే విజయం సాధించడంతో పాటు, నిర్భయ కుటుంబానికి న్యాయం జరిగేలా చేసిన సీమకు అభినందనలు వెల్లువెత్తాయి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి అయిన సీమ ఢిల్లీ యూనివర్సిటీలో చదవు అవగానే సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆమె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-03-20T05:50:19+05:30 IST