Abn logo
Sep 16 2020 @ 21:24PM

`లక్ష్మీబాంబ్` మోషన్ పోస్టర్ వచ్చేసింది!

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ చిత్రం `లక్ష్మీ బాంబ్` మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. రెండు విభిన్న లుక్‌లతో అక్షయ్ ఆకట్టుకున్నాడు. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన `కాంచన` హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకను రూపొందించిన రాఘవ లారెన్స్ ఈ సినిమాకు దర్శకుడు. 


ఈ సినిమాలో అక్షయ్ సరసన కియారా ఆడ్వాణీ హీరోయిన్‌గా నటించింది.. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. దీపావళి కానుకగా నవంబర్ 9న హాట్‌స్టార్‌లో `లక్ష్మీ బాంబ్‌` విడుదల కానుంది. 



Advertisement
Advertisement
Advertisement