చాణక్యనీతి: ఇటువంటి తప్పులు చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం దక్కదు!

ABN , First Publish Date - 2022-05-14T12:34:09+05:30 IST

చాణక్య నీతి ప్రకారం డబ్బు సంపాదన విషయంలో...

చాణక్యనీతి: ఇటువంటి తప్పులు చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం దక్కదు!

చాణక్య నీతి ప్రకారం డబ్బు సంపాదన విషయంలో ఎల్లప్పుడూ కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. ఆచార్య చాణక్య భావనలో సంపదకు దేవత లక్ష్మీదేవి. కలియుగంలో లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిపై ఉంటుందో అప్పుడు అతనికి సంపదలు కలుగుతాయి. లక్ష్మిదేవి ఆశీర్వాదం మనిషికి ఆనందాన్ని, శ్రేయస్సును అందిస్తుంది. డబ్బు అందుబాటులో ఉన్నప్పుడు మనిషి అన్నివిధాలా అభివృద్ధి చెందుతాడు. అయితే డబ్బు ఉందికదా అని తప్పుడు పనులు చేయడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతాడు. ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


అహంకారానికి చోటివ్వద్దు

మనిషి ఇతరుల కంటే తనను తాను ఉన్నతునిగా లేదా యోగ్యునిగా భావించడం అహంకారానికి సంకేతం. దీనిని మనిషి నివారించాలి. మనిషి అహంకారంలో చిక్కుకుపోయినప్పుడు అతని ప్రతిభ నాశనం అవుతుంది. అలాంటివారు ఆ తరువాతి కాలంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. లక్ష్మీదేవి అలాంటి వారి ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. 

కఠినంగా మాట్లాడొద్దు

చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడూ మధురంగా ​​ మాట్లాడాలి. మధురంగా మాట్లాడేవారు జీవితంలో మరింత పురోగతిని సాధిస్తారు. అలాంటి వారిని అందరూ ఇష్టపడతారు. ప్రతిచోటా గౌరవం అందుకుంటారు. మనిషి కఠినంగా మాట్లాడినప్పుడు అతనిని చుట్టుపక్కలవారు ఆదరించరు. లక్ష్మీదేవి అనుగ్రహం దక్కదు. సమస్యలు, ఆటంకాలు పెరుగుతాయి.

Read more