లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-28T05:19:22+05:30 IST

చార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషిచేయాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు.

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి: కలెక్టర్‌
కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ సత్పథి తదితరులు

భువనగిరి రూరల్‌,సెప్టెంబరు 27: ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషిచేయాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషి చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్లు డి.శ్రీనివా్‌సరెడ్డి, దీపక్‌తివారి,డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖఅధికారి యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఏడీశ్యాంసుందర్‌, జయపాల్‌రెడ్డి, డీపీవోసు నంద,డీఎంవో సబిత, సత్యనారాయణ, ప్రజాసంఘాల ప్రతినిధులు బట్టు రామచంద్ర య్య, రాజు, రాపోలు వీరమోహన్‌ పాల్గొన్నారు. అదే విధంగా జడ్పీ, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు.


లక్ష్మణ్‌ బాపూజీ జీవితచరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి : జాజుల

చౌటుప్పల్‌: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. లక్ష్మణ్‌ బాపూజీ జయంతి పురస్కరించుకొని చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించి మాట్లాడారు. మంచిర్యాల జిల్లాకు లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బడుగు లక్ష్మయ్య, ఆదిమూలం శంకర్‌, మునుకుంట్ల సత్యనారాయణ, వరికుప్పల మధు, వీరమల్ల కార్తీక్‌, బండిగారి వెంకట్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:19:22+05:30 IST