స్వరాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడు లక్ష్మణ్‌ బాపూజీ

ABN , First Publish Date - 2022-09-28T03:53:12+05:30 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మంగళవారం బాపూజీ జయంతిని పురస్కరించుకొని కలెక్టరే ట్‌లో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దశా బ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం బాపూ జీ అన్నారు.

స్వరాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడు లక్ష్మణ్‌ బాపూజీ
కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 27:  తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మంగళవారం బాపూజీ జయంతిని పురస్కరించుకొని కలెక్టరే ట్‌లో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దశా బ్దాల  పోరాటానికి నిలువెత్తు నిదర్శనం బాపూ జీ అన్నారు.  తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెం దాలంటే ప్రత్యేక రాష్ట్రంతోనే సాధ్యమని ఢిల్లీలో దీక్ష చేపట్టారని, నేటి తరం ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. నీలకంటేశ్వర్‌రావు, వెంక టయ్య,  యోగేశ్వర్‌, నాగేందర్‌, పాల్గొన్నారు.  

పద్మశాలి మార్కండేయ సంఘం ఆధ్వర్యం లో  లక్ష్మిటాకీస్‌ చౌరస్తాలో బాపూజీ జయంతి నిర్వహించారు. రవికుమార్‌, జ్ఞాని, భావన రుషి, మహేశ్వరి, బాపు పాల్గొన్నారు.  

స్వరాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడు  బాపూజీ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌ అన్నారు. అర్జున్‌, రామా రావు, మురళి, చక్రవర్తి, సంపత్‌ పాల్గొన్నారు.  

జడ్పీ కార్యాలయంలో బాపూజీ జయంతి  నిర్వహించారు. సీఈవో నరేందర్‌ మాట్లాడుతూ బాపూజీ సేవలు మరువలేనివన్నారు. డిప్యూటీ సీఈవో లక్ష్మినారాయణ, బాలకిషన్‌రావు, ప్రణ య్‌, రమేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

ఏసీసీ: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం భావి తరాలకు ఆదర్శమని ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొ న్నారు. ఆయన నివాసంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ చై ర్మన్‌ రాజయ్య, ఏఎంసీ చైర్మన్‌ పల్లె భూమేష్‌,  కౌ న్సిలర్లు, యువనాయకుడు విజిత్‌రావు ఉన్నారు.  

బీసీ జాగృతి ఆధ్వర్యంలో లక్ష్మణ్‌ బాపూజీ జయంతి నిర్వహించారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం కృషి చేశారన్నారు. కౌన్సి లర్లు  నరేష్‌, రాజేశ్వరి, సుధాకర్‌, శ్రీధర్‌, రాంస త్తయ్య, దేవేందర్‌, వైద్యభాస్కర్‌ పాల్గొన్నారు.  

 జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో  కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను కుమరం భీం సేవా సమతి ఆధ్వర్యంలో నిర్వహించారు. క్రీడాకారులకు పండ్లు పంపిణీ చేశారు. చంద్ర మౌళి, వెంకటయ్య, రాంరెడ్డి, సుధీర్‌, ప్రభాకర్‌,  పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహిం చారు. శ్రీనివాస్‌,సల్మాన్‌ఖాన్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-09-28T03:53:12+05:30 IST