న్యాయవాదుల సంక్షేమ నిధి తొలి విడత విడుదల

ABN , First Publish Date - 2020-05-29T02:01:21+05:30 IST

న్యాయవాదుల సంక్షేమ నిధి తొలి విడత మొత్తాన్ని ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గురువారం విడుదల చేశారు. ఈ నిధికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రూ. 25 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

న్యాయవాదుల సంక్షేమ నిధి తొలి విడత విడుదల

హైదరాబాద్ : న్యాయవాదుల సంక్షేమ నిధి తొలి విడత మొత్తాన్ని ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గురువారం విడుదల చేశారు. ఈ నిధికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రూ. 25 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.


అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ అనంత నర్సింహారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా...  14,166 మంది న్యాయవాదులకు గాను వారి వారి ఖాతాలకు రూ. 10 వేల చొప్పున నేరుగా జమ చేశారు. ఇక న్యాయవాదుల గుమస్తాలకు కూడా రూ. 5 వేల చొప్పున అందించారు. 

Updated Date - 2020-05-29T02:01:21+05:30 IST