న్యాయవాదుల నిరసన

ABN , First Publish Date - 2021-07-31T04:36:17+05:30 IST

నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో ప్రాక్టిస్‌ చేస్తున్న మహిళా న్యా యవాది, జార్ఘండ్‌లోని ధన్‌బాద్‌లో అదనపు జిల్లా జడ్జి హత్యలకు నిరసనగా శుక్రవా రం గద్వాల బార్‌ అసోసియేషన్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

న్యాయవాదుల నిరసన
విధులు బహిష్కరించిన గద్వాల న్యాయవాదులు

  గద్వాల క్రైం, జూలై 30:  నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో ప్రాక్టిస్‌ చేస్తున్న మహిళా న్యా యవాది, జార్ఘండ్‌లోని ధన్‌బాద్‌లో అదనపు జిల్లా జడ్జి హత్యలకు నిరసనగా శుక్రవా రం గద్వాల బార్‌ అసోసియేషన్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాది రాయేసా ఫాతిమా, న్యాయమూర్తి ఉత్తం ఆనంద్‌ హత్యలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వృత్తిలో ఉన్న న్యాయవాదుల, జడ్జిలపై హత్యలకు తెగబడ టం దారుణమని, ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ నాయకులు పూజారీ శ్రీధర్‌, మధుసూదన్‌బాబు, రఘు, రాజేష్‌ తదితరులున్నారు.


Updated Date - 2021-07-31T04:36:17+05:30 IST