Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 10 2021 @ 12:39PM

Bhabanipur లో దీదీని ఢీకొనేది ఈమే.. బీజేపీ అధికారిక ప్రకటన

  • బీజేపీ అభ్యర్థినిగా లాయర్ ప్రియాంక తిబ్రేవాల్

భవానీపూర్ (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ భవానీపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిని శుక్రవారం ప్రకటించింది. భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థినిగా పోటీచేస్తున్న సీఎం మమతాబెనర్జీపై బీజేపీ అభ్యర్థినిగా ప్రియాంక తిబ్రేవాల్ ను కమలనాథులు బరిలోకి దింపుతున్నారు. బీజేపీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసులో పోరాడుతున్న లాయర్ ప్రియాంక తిబ్రేవాల్ మమతాబెనర్జీపై పోటీకి దింపింది.41 ఏళ్ల ప్రియాంక తిబ్రేవాల్ కోల్ కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది. ఈమె 2014 లో భారతీయ జనతా పార్టీలో చేరింది. 

ప్రస్తుతం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాలో ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రియాంకను ఎంపీ బాబుల్ సుప్రియో బీజేపీలోకి తీసుకువచ్చారు.ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా నందిగ్రామ్‌లో బీజేపీ ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఓట్ల తేడా 1959 మాత్రమే ఉండటంతో మమతా బెనర్జీ కోర్టులో ఫలితాన్ని సవాలు చేశారు. రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి ఆమె భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం ఆరు నెలల పాటు రాష్ట్ర శాసనసభలో సభ్యత్వం లేని ఏ మంత్రి అయినా మంత్రిగా ఉండకూడదు.టీఎంసీ గెలుపొందిన అభ్యర్థి శోభందేబ్ చటోపాధ్యాయ్ సెప్టెంబర్ 30 న భవానీపూర్ నుంచి ముఖ్యమంత్రి పోటీ చేసేలా సీటును ఖాళీ చేశారు. గతంలో మమతా బెనర్జీ ఒకే స్థానం నుంచి రెండుసార్లు గెలిచారు.


Advertisement
Advertisement