‘కార్మికుల హక్కులు హరించేలా చట్టాలు’

ABN , First Publish Date - 2020-09-24T07:44:16+05:30 IST

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు బుధ

‘కార్మికుల హక్కులు హరించేలా చట్టాలు’

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 23: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు బుధ వారం అమలాపురంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ కార్మికుల హక్కు లను హరించేలా చట్టాలను సవరిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం తీరును తప్పుబట్టారు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వాసంశెట్టి సత్తిరాజు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మల్లారపు సత్యనారాయణల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డివిజన్‌ కార్యదర్శి నిమ్మకాయల శ్రీను, ఆటో యూనియన్‌ నాయకులు కామిరెడ్డి చంద్రరావులు మాట్లా డారు. నాయకులు మోకా శ్రీనివాస్‌, కార్యదర్శి నాగేశ్వర రావు, కురచ నాగేశ్వరరావు, సవరపు శ్రీహరి  పాల్గొన్నారు. 


కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన

ముమ్మిడివరం: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ముమ్మిడివరంలో నిరసన వ్యక్తం చేశారు. కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను కేంద్రం అవలంభిస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. తహశీల్దార్‌ కార్యాలయం వరకు వారు ర్యాలీగా వెళ్లి  నిరసన తెలిపారు. బీజేపీ ప్రభు త్వం కార్మికుల హక్కులను కాలరాసి యాజమాన్యాలకు బానిసగా మార్చేస్తుందన్నారు.  ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరణ ప్రకటించిందని ఆరోపించారు. వినతిపత్రాన్ని తహశీల్దార్‌ పోతురాజుకు అందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌, శీలం వెంకటేశ్వరరావు, పెట్టా శివకుమార్‌, అజయ్‌కుమార్‌, సురేష్‌, జి.అనంతలక్ష్మి, ఏవీ రమణ మ్మ, పాము బాలయ్య, ఎస్‌.నాగరత్నం, ఎస్‌.అరుణ, వి.సుభాషిణి, జి.దుర్గాభవానీ, వి.మీనా, కె.శ్రీనివాస్‌, ఎస్‌.వెంకటలక్ష్మి, వై.సావిత్రి, సకిలే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఐటీయూ ధర్నా

తాళ్లరేవు: కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తాళ్లరేవు సీఐటీయూ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సీఐటీయూ నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రైతులను దెబ్బతీసేలా బిల్లులు తేవడం దారుణమన్నారు. కేంద్రం తీసుకున్న కార్మిక, రైతు వ్యతిరేక నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  తహశీల్దార్‌ జి.చిన్నిబాబుకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పలువురు సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు. 


కార్మికుల నిరసన ప్రదర్శన

కాట్రేనికోన: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని వివిధ కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం కార్మిక సం ఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.  ముఖ్యమైన రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరచి కార్మికుల జీవితాల్లో చిచ్చు పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తహశీల్దార్‌ మహాలక్ష్మమ్మకు వినతిపత్రం అందజేశారు. సీపీ ఎం నాయకుడు ఎన్‌.కృష్ణంరాజు, గ్యాస్‌ యూనియన్‌ నాయ కుడు వి.రాంబాబు, క్రాంతికిరణాల యూనియన్‌ నాయకులు కమిడి శ్రీనివాస్‌, ఎ.శ్రీనివాస్‌, ఆశావర్కర్ల నాయకులు ఎం.ర మాదేవి, ఎం.మంగాదేవి, ఎం.దుర్గ, కె.వరలక్ష్మి పాల్గొన్నారు.


ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలి

రామచంద్రపురం:  పది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో రామచంద్రపురంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.పెద్దిరెడ్డి రాము, ఎం.వి.రమణ, జి.సూరిబాబు, ప్రేమానందం, శారద, టి.సూరిబాబు పాల్గొన్నారు.


ప్రైవేటు ఎలక్ర్టికల్‌ కార్మికులను ఆదుకోవాలి

మామిడికుదురు: లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు ఎలక్ర్టి కల్‌ కార్మికులను ఆదుకోవాలని శ్రీనవదుర్గ ప్రైవేటు వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు మెడబాల రామారావు, ప్రధాన కార్యదర్శి బత్తుల జనార్థనరావు  కోరారు. లాక్‌డౌన్‌, ఇసుక కొరతతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. మూడేళ్లుగా కార్మికులకు రావలసిన పెళ్లికానుక, ప్రసూతి ఖర్చులు విడుదల చేయాలని  కోరారు. కార్యక్రమంలో మామిడిశెట్టి సత్యనారాయణ, కట్టా రాంబాబు, చిట్టూరి సురేష్‌, పితాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T07:44:16+05:30 IST