తైవాన్ పార్లమెంట్‌లో పిడిగుద్దులు

ABN , First Publish Date - 2020-11-28T02:32:27+05:30 IST

తైవాన్ పార్లమెంట్‌లో పిడిగుద్దులు

తైవాన్ పార్లమెంట్‌లో పిడిగుద్దులు

తైపీ: తైవాన్ పార్లమెంట్‌లో అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తీవ్ర చర్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పిడిగుద్దులకు దిగారు. ఈ సంఘటనతో కొంత సేపటి వరకు పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది.


అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం తర్వాత పంది మాంసం దిగుమతిపై నిషేధం ఎత్తివేసిన తర్వాత మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు పంది మాంసం బ్యాగులను సభలోకి తీసుకొచ్చి గందరగోళం సృష్టించారు. పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తైవాన్ ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడంపై దేశంలో పలు చోట్ల నిరసలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-11-28T02:32:27+05:30 IST