triangle love: ట్రయాంగిల్ లవ్...క్లాస్‌మేట్‌ను కొడవలితో పొడిచిన లా స్టూడెంట్

ABN , First Publish Date - 2022-08-02T17:51:23+05:30 IST

ట్రయాంగిల్ లవ్ కారణంగా ఓ విద్యార్థి తన క్లాస్‌మేట్‌ అయిన లా విద్యార్థిని కొడవలితో పొడిచిన ఘటన...

triangle love: ట్రయాంగిల్ లవ్...క్లాస్‌మేట్‌ను కొడవలితో పొడిచిన లా స్టూడెంట్

లక్నో(ఉత్తరప్రదేశ్): ట్రయాంగిల్ లవ్(triangle love) కారణంగా ఓ విద్యార్థి తన క్లాస్‌మేట్‌ అయిన లా విద్యార్థిని(Law student) కొడవలితో పొడిచిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరంలోని ఓ ప్రైవేటు యూనివర్శిటీలో జరిగింది. సుధాంషు శేఖర్ అనే లా విద్యార్థి తన క్లాస్‌మేట్ అయిన చంద్రభూషణ్ భరద్వాజ్(26)ను తరగతి గదిలోనే కొడవలితో పొడిచాడు(stabs). ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భరద్వాజ్ ను కేజీఎంయూ ఆసుపత్రికి తరలించారు.కొడవలితో పొడవడం వల్ల తీవ్ర గాయాలపాలై రక్తస్రావం అధికంగా జరగడంతో భరద్వాజ్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడని, అతనికి చికిత్స అందిస్తున్నామని కేజీఎంయూ వైద్యులు చెప్పారు. లా విద్యార్థి అయిన శేఖర్‌కు తన సహధ్యాయిని అయిన ఓ యువతితో స్నేహబంధం ఏర్పడింది.


అయితే బాధితుడైన భరద్వాజ్ కూడా శేఖర్ స్నేహితురాలైన యువతితో మాట్లాడుతున్నాడు. తన స్నేహితురాలితో భరద్వాజ్ మాట్లాడుతున్నాడని శేఖర్ అతనిపై కోపం పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఈ వ్యవహారంపై ఇద్దరు యువకులు కొన్ని రోజుల క్రితం ఘర్షణ పడ్డారు.ముక్కోణపు ప్రేమ వ్యవహారమే(triangle love theory) దాడికి దారి తీసింది. భరద్వాజ్ సోమవారం మధ్యాహ్నం తన క్లాస్‌మేట్ అయిన అనిమేష్ కుమార్‌తో కలిసి తరగతికి హాజరయ్యాడు. క్లాస్ ముగుస్తుండగా శేఖర్ వెనుక నుంచి వచ్చి తన బ్యాగులోని కొడవలిని తీసి భరద్వాజ్ ను అతి దారుణంగా పొడిచాడు. కొడవలితో చేసిన దాడిలో భరద్వాజ్ చేతులు, మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాయి. కొడవలితో దాడి చేసి పలుసార్లు భరద్వాజ్ ను పొడవటంతో తరగతి గదిలోని(classroom) తోటి విద్యార్థులు నిశ్ఛేష్టులయ్యారు. 


ఈ ఘటనపై భరద్వాజ్ స్నేహితుడు అనిమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భరద్వాజ్ పరిస్థితి విషమించడంతో కేజీఎంయూ ఆసుపత్రి వైద్యుల సలహా మేర సహారా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శేఖర్ ముక్కోణపు ప్రేమ వ్యవహారం(triangle love story) కారణంగానే భరద్వాజ్‌పై దాడి చేశాడని ఏసీపీ విభూతిఖండ్ తెలిపారు.నిందితుడు శేఖర్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ సయ్యద్ అబ్బాస్ అలీ చెప్పారు.తరగతి గదిలో కొడవలితో దాడి ఘటనపై అమిటీ యూనివర్సిటీ విచారణకు ఆదేశించింది. 


విచారణ జరిగే వరకు ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేశారు.యూనివర్శిటీ క్యాంపస్‌లో ఎలాంటి హింస జరిగినా తాము సహించమని, విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని అమిటీ యూనివర్శిటీ అధికార ప్రతినిధి చెప్పారు.ఈ ఘటన గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించామని, పోలీసుల విచారణలో తాము సహకరిస్తామని యూనివర్శిటీ అధికార ప్రతినిధి వివరించారు.


Updated Date - 2022-08-02T17:51:23+05:30 IST