Abn logo
Mar 28 2020 @ 21:33PM

‘కరోనా క్రైసిస్ ఛారిటీ’కి లావణ్య లక్ష విరాళం

పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సిసిసి (కరోనా క్రైసిస్ ఛారిటీ) అనే నిధికి లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ ‘సిసిసి’ రోజువారీ వేతన సంపాదకుల సహాయం కోసం ఉద్దేశించబడింది, లాక్‌డౌన్ కొనసాగుతున్నందున పరిశ్రమకు అందరి మద్దతు అవసరమని నటీనటులకు దీని ఆవిర్భావం వెనుక ఉన్న విషయాన్ని ఇప్పటికే తమ్మారెడ్డి, ఎన్. శంకర్ తెలిపి ఉన్నారు. అలాగే కరోనా విషయంలో ఇప్పటికే హీరోయిన్స్ ఎవ్వరూ ముందుకు రాలేదని, కేవలం ప్రణీత మాత్రమే స్పందించిందని అంతా అనుకుంటున్న తరుణంలో లావణ్య రూ. లక్ష ప్రకటించి తన ఉదారతను చాటుకుంది.


అయితే ఈ ‘అర్జున్ సురవరం’ నటి కరోనా క్రైసిస్ ఛారిటీ‌కి విరాళం ఇచ్చిన తొలి మహిళా నటిగా గుర్తింపు పొందింది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల వేలాది మంది సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని, అందువల్ల వారికి సహాయం చేయడానికి అందరూ కలిసి రావాలని భావిస్తూ మెగాస్టార్ చిరంజీవి ‘సిసిసి’ని ప్రారంభించారు. చిరు ప్రారంభించిన ఈ చారిటీకి తన వంతు సాయం ప్రకటించిన లావణ్య మాట్లాడుతూ.. ‘‘చిత్ర పరిశ్రమలో భాగంగా ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీ (సిసిసి)‌ని స్థాపించారు. రోజూవారీ వేతనాలపై పనిచేసే సినీ కార్మికులకు సిసిసి ద్వారా నా వంతు సాయం అందిస్తున్నాను. ఇందులో భాగంగా రూ. 1 లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నాను’’ అని ఆమె చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement