లారస్‌ బయో రూ.60 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2021-05-04T06:18:55+05:30 IST

బయోటెక్నాలజీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి లారస్‌ బయో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.60 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది...

లారస్‌ బయో రూ.60 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బయోటెక్నాలజీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి లారస్‌ బయో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.60 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. రిచ్‌కోర్‌ లైఫ్‌ సైన్సె్‌సలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి దాని పేరును లారస్‌ బయోగా లారస్‌ లాబ్స్‌ మార్చింది. లారస్‌ బయో ద్వారా కంపెనీ ఫెర్మెంటేషన్‌ సామర్థ్యాలు పెరుగుతాయని, కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నామని లారస్‌ లాబ్స్‌ సీఈఓ చావా సత్యనారాయణ తెలిపారు. ఒక్కొక్కటి 45 వేల లీటర్ల ఫెర్మంటేషన్‌ సామర్థ్యం కలిగిన రెండు రియాక్టర్లు ఈ నెలలో అందుబాటులోకి వచ్చే వీలుంది. ఇదే సామర్థ్యం కలిగిన మరో రెండు రియాక్టర్లు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ భావిస్తోంది. అదనంగా మరో 10 లక్షల లీటర్ల ఫెర్మంటేషనన్‌ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనుంది. ఇందుకు అవసరమైన భూమిని సమకూర్చుకునే ప్రక్రియలో ఉంది. 


100 కోట్ల డాలర్ల ఆదాయ లక్ష్యం: 2022-23 నాటికి లారస్‌ లాబ్స్‌ 100 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. యాంటీరెట్రోవైరల్‌ యేతర ఏపీఐ ఉత్పత్తుల్లో కంపెనీ 2022-23 నాటికి అదనపు సామర్థ్యాలను సమకూర్చుకోనుంది. రెండేళ్ల తర్వాత సింథసిస్‌ వ్యాపార విభాగంలో కూడా వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండగలదని అంచనా వేస్తోంది. ఇటువంటి సానుకూల పరిణామాలు ఆదాయాన్ని 100 కోట్ల డాలర్లకు చేర్చగలవని భావిస్తోంది. 


Updated Date - 2021-05-04T06:18:55+05:30 IST