Abn logo
Oct 30 2020 @ 04:01AM

యువ ఆటగాళ్లు లేకనే...

చెన్నై పరాజయాలపై లారా


దుబాయ్‌: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. మూడుసార్లు ట్రోఫీ గెలవడంతో పాటు ఈ ఏడాది మినహా ఇప్పటివరకు జరిగిన అన్నీ సీజన్లలో సీఎ్‌సకే ప్లేఆఫ్స్‌కు చేరింది. అలాంటి చెన్నై  ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలవడానికి కారణం ఆ జట్టులో యువరక్తం లేకపోవడమేనని వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా అభిప్రాయపడ్డాడు.‘ఽసీఎ్‌సకే జట్టులో ఎక్కువ మంది ప్లేయర్లు 35 ఏళ్లు పైబడినవారే. విదేశీ ఆటగాళ్లు కూడా వయసు మీదపడిన వారే. సుదీర్ఘకాలంగా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరిని అనుభవజ్ఞులని అట్టిపెట్టుకున్న చెన్నై యువకులను విస్మరించింది. ఇదే ఆ జట్టును ఉచ్ఛస్థితి నుంచి పాతాళానికి చేర్చింది’ అని లారా చెప్పాడు.

Advertisement