నాకు కరోనా లేదు..!

ABN , First Publish Date - 2020-08-07T09:40:49+05:30 IST

తనకు కరోనా సోకిందంటూ సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా ఖండించాడు. అవి తప్పుడు వార్తలని ...

నాకు కరోనా లేదు..!

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: తనకు కరోనా సోకిందంటూ సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా ఖండించాడు. అవి తప్పుడు వార్తలని అన్నాడు. తాను కరోనా పరీక్ష చేయించుకున్నది వాస్తమేనని..కానీ, ఫలితం నెగెటివ్‌గా వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. కరోనా మహమ్మారి కారణంగా యావత్‌ సమాజం తల్లడిల్లిపోతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విష ప్రచారాలను ఆపాలని లారా కోరాడు. 

Updated Date - 2020-08-07T09:40:49+05:30 IST