Abn logo
Sep 24 2021 @ 23:23PM

కేజీహెచ్‌లో ట్రాన్స్‌జెండర్‌ వన్‌స్టాఫ్‌ సెంటర్‌ ప్రారంభం

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి

ఓపీ విభాగం పక్కన ఏర్పాటు

రోజూ 9-12 గంటల మధ్య వైద్యసేవలు, కౌన్సెలింగ్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 24: కేజీహెచ్‌ అవుట్‌ పేషెంట్‌ విభాగంలో ట్రాన్స్‌జెండర్స్‌ కోసం వన్‌స్టాఫ్‌ సెంటర్‌ ప్రారంభించారు. ఏపీ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ, వలంటరీ హెల్త్‌ సర్వీసెస్‌, కేంద్రంలోని కంట్రోల్‌ఫర్‌ డిసీజెస్‌ సెంటర్‌లు సంయుక్తంగా ఆస్పత్రి ఓపీ విభాగం పక్కన ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి శుక్రవారం ప్రారంభించారు. కేజీహెచ్‌ సిబ్బందితోపాటు ఏఎంసీ వైద్యులు ఈ కేంద్రంలో సేవలందించనున్నారు.


ఈ సందర్భంగా డాక్టర్‌ మైథిలి మాట్లాడుతూ రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కేంద్రంలో సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ట్రాన్స్‌జెండర్స్‌ ఓపీలో టోకెన్‌ తీసుకుని ఈ కేంద్రంలో వైద్య సేవలు, కౌన్సెలింగ్‌ పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ డైరెక్టర్‌ డాక్టర్‌ లిసియా, వలంటీర్‌ హెల్త్‌సర్వీసెస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ జోసెఫ్‌, డి.విలియమ్స్‌ పాల్గొన్నారు.