శ్రీసిటీలో అత్యాధునిక నూతన మురుగునీటి శుద్ధి ప్లాంటు ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-28T06:19:18+05:30 IST

శ్రీసిటీలో ఎలకా్ట్రనిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ) వద్ద నూతనంగా నిర్మించిన మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని(ఎ్‌సటీపీ) రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి విజయకుమార్‌ మంగళవారం ప్రారంభించారు.

శ్రీసిటీలో అత్యాధునిక నూతన మురుగునీటి శుద్ధి ప్లాంటు ప్రారంభం
మురుగునీటి శుద్ధి ప్లాంటును ప్రారంభిస్తున్న రాష్ట్ర పర్యావరణశాఖ కార్యదర్శి విజయకుమార్‌

సత్యవేడు, జూలై 27:  శ్రీసిటీలో ఎలకా్ట్రనిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ) వద్ద నూతనంగా నిర్మించిన మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని(ఎ్‌సటీపీ) రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి విజయకుమార్‌ మంగళవారం  ప్రారంభించారు. శ్రీసిటీకి వచ్చిన ఆయనకు  శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, ఇక్కడ పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు.  ఈ సందర్భంగా విజయకుమార్‌ మాట్లాడుతూ ఎంఎల్‌డీ సామర్థ్యం ఉన్న అత్యాధునిక ప్లాంటును 2.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.8.5 కోట్ల వ్యయంతో నిర్మించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.శ్రీసిటీ చేపడుతున్న పచ్చదనం పెంపు చర్యలను ప్రశంసించిన ఆయన ఇక్కడ పర్యావరణ నిర్వహణ వ్యవస్థలకు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) గోల్డ్‌ రేటింగ్‌, ఐఎ్‌సవో ధృవీకరణ గుర్తింపు దక్కినందుకు శ్రీఇసటీ యాజమాన్యాన్ని అభినందించారు. శ్రీసిటీని గ్రీన్‌సిటీగా అభివర్ణించిన ఆయన ఇక్కడ చేపడుతున్న చురుకైన సుస్థిర చర్యల ఫలితంగా అతి త్వరలో శ్రీసిటీ రాష్ట్రంలోని ఇతర పారిశ్రామిక వాడలకు ఓ మోడల్‌గా మారుతుందన్నారు. పర్యావరణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం తగిన ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలతో(ఎ్‌సవోపీ) ఆన్‌లైన్‌ పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని పారిశ్రామిక యూనిట్లునిర్దేశిత విధానాలను కచ్ఛితంగా పాటించాలని పిలుపునిచ్చారు. శ్రీసిటీ ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ సుబ్రహ్మణ్యం విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం, తాగునీరుతో పాటు కొవిడ్‌ సహాయక చర్యలు ప్రాధాన్యత అంశాలుగా తాము సీఎ్‌సఆర్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కార్యదర్శికి వివరించారు. సతీష్‌ కామత్‌, ప్రెసిడెంట్‌(ఆపరేషన్‌) తమ ప్రెసెంటేషన్‌లో శ్రీసిటీ ఎలాంటి కాలుష్యం లేకుండా పర్యావరణ హితంగా పురోగమిస్తున్న దేశంలోని మొదటి అతి పెద్ద పారిశ్రామికవాడగా పేర్కొన్నారు. అనంతరం స్థానిక బిజినెస్‌ సెంటర్‌లో పరిశ్రమల సీనియర్‌ అధికారులతో సమావేశమైన విజయకుమార్‌ కాలుష్యం, పర్యావరణం, పచ్చదనం పెంపు, సీఎ్‌సఆర్‌ తదితర అంశాలపై పరస్పరం చర్చించారు.  సమావేశం అనంతరం శ్రీసిటీ పరిసరాలను సందర్శించడంతో పాటు ఎవర్తన్‌, హంటర్‌ దగ్లస్‌ ఉత్పత్తి కేంద్రాలను ఆయన పరిశీలించారు. 

Updated Date - 2021-07-28T06:19:18+05:30 IST