లాఫింగ్ బుద్ధ ఎవరు?... ఇంట్లో, దుకాణాల్లో ఈ బొమ్మను ఎందుకు ఉంచుతారో తెలుసా?

ABN , First Publish Date - 2022-05-14T15:07:38+05:30 IST

లాఫింగ్ బుద్ధ బొమ్మను చాలా మంది తమ ఇళ్లలో...

లాఫింగ్ బుద్ధ ఎవరు?... ఇంట్లో, దుకాణాల్లో ఈ బొమ్మను ఎందుకు ఉంచుతారో తెలుసా?

లాఫింగ్ బుద్ధ బొమ్మను చాలా మంది తమ ఇళ్లలో ఉంచడాన్ని మీరు చూసేవుంటారు. లాఫింగ్ బుద్ధను ఇంటిలో ఉంచితే అది చాలా శుభప్రదమని చెబుతారు. ఇంతకీ లాఫింగ్ బుద్ధ ఎవరు? ఈ బొమ్మ ఉంచితే పురోగతి, శ్రేయస్సు ఎలా లభిస్తుందో తెలుసా? లాఫింగ్ బుద్ధ జపాన్ నివాసి, గౌతమ బుద్ధుని శిష్యులలో ఒకరు. అతని పేరు హోతాయ్. ఆత్మజ్ఞానం పొందిన వెంటనే అతను నవ్వడం ప్రారంభించాడని చెబుతారు. ఆ తరువాత హోతాయ్ అందరినీ నవ్వించేవాడట. 


నవ్వడం అతని ప్రత్యేకత. అందుకే అతనికి ఆ పేరు పెట్టారు. గౌతమ బుద్ధుని మిగిలిన శిష్యుల మాదిరిగా అతను ఉపన్యాసాలు చేయలేదని, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడని, అదే అతని సందేశమని చెబుతుంటారు. ఆయన ఎక్కడికి వెళ్లినా జనం విపరీతంగా వచ్చేవారని ఆయనను కలిసేందుకు జనం వచ్చేవారని అంటుంటారు. అతని క్రియల ద్వారా జ్ఞానం లభిస్తుందని, దీనికి ప్రబోధం అవసరం లేదని అనేవారు. అందుకే లాఫిగ్ బుద్ధ బొమ్మను ఇంటిలో లేదా దుకాణంలో ఉంచితే శుభప్రదమని భావిస్తారు.

Read more