Abn logo
Jul 8 2020 @ 19:10PM

యువ గాయ‌నికి ల‌తా మంగేష్క‌ర్ ఆశీర్వాదం

ల‌తా మంగేష్క‌ర్‌.. భార‌తీయ సినీ, సంగీత ప్ర‌పంచంలో ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. గాయ‌నిగా ఆమెకు సంగీతాభిమానుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అలాంటి ప్ర‌ముఖ గాయని లతా మంగేష్కర్ ఓ యువ గాయ‌ని త‌న ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్నారు. సామ‌దిప్తా ముఖ‌ర్జీ అనే యువ గాయ‌ని పాడిన పాట విన్న లతా మంగేష్క‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ‘‘నాకు ఓ వీడియో వ‌చ్చింది. అందులో ఓ యువ‌తి ఆస్ట్రియ‌న్ మొజార్డ్ 40వ వాద్య గోష్టిని మ‌న భార‌తీయ రాగంతో అద్భ‌తంగా ఆల‌పించింది. త‌ను భ‌విష్య‌త్తులో మంచి గాయ‌ని కావాల‌ని ఆశీర్వ‌దిస్తున్నాను’’ అన్నారు ల‌తా మంగేష్క‌ర్‌. ఈ పోస్టుకు సామ‌దిప్తా ముఖ‌ర్జీ ట్విట్ట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ‘‘కృత‌జ్ఞ‌త‌లు మేడ‌మ్‌. చిన్న‌ప్ప‌టి నుండి మీరంటే ఎంతో గౌరవం, ఆరాధ‌న‌. మీ రూపంలో ఆ దేవుడు న‌న్ను ఆశీర్వ‌దించాడు. ఇంత‌క‌న్నా నాకింకేం కావాలి. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాను. నా సంగీత ప్ర‌పంచంలో ఉన్నత శిఖ‌రాల‌ను అందుకునేందుకు కృషి చేస్తాను’’ అన్నారు  సామ‌దిప్తా ముఖ‌ర్జీ .


Advertisement
Advertisement
Advertisement