Abn logo
Jan 22 2021 @ 22:17PM

బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం.. డైరెక్టర్‌ ఎవరంటే?

ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న గుడ్‌ న్యూస్‌ రాబోతోందా? అంటే అవునని చెప్పక తప్పదు. నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు మొదలయ్యాయి. ఎప్పటి నుంచో ఈ వార్త కోసం నందమూరి అభిమానులు కాచుకుని కూర్చున్నారు. బాలయ్యని అడిగితే.. ''పక్కాగా ప్లాన్‌ చేస్తున్నాం.. స్ర్కిప్ట్‌లు రెడీ చేయిస్తున్నాను.. ఒక్కొక్కటిగా వదులుతాం'' అంటున్నారే కానీ.. ఎప్పుడు వారసుడి ఎంట్రీ అనేది మాత్రం చెప్పడం లేదు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ సంవత్సరం జూన్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. 

బాలయ్య పుట్టినరోజైన జూన్‌ 10న మోక్షజ్ఞ చిత్రాన్ని ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారని, ఈ చిత్రానికి డైరెక్టర్‌ కూడా ఫైనల్‌ అయ్యాడనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది. ఇంతకీ మోక్షజ్ఞని పరిచయం చేసే డైరెక్టర్‌ ఎవరని అనుకుంటున్నారా? డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాధ్‌కే బాలయ్య తనయుడిని కూడా పరిచయం చేసే అవకాశం లభించిందని, ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న 'లైగర్‌' తర్వాత పూరీ ఈ చిత్రమే చేయనున్నారని ఇండస్ట్రీలో వార్తలు నడుస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం పూరీ ఓ పవర్‌ఫుల్‌ స్టోరీ రెడీ చేశారని, బాలయ్య కూడా స్టోరీ ఓకే చేశారని అంటున్నారు. మరో విశేషం ఏమిటంటే.. మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రమే పాన్‌ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకోనుందని, చాలా గ్రాండ్‌గా మోక్షజ్ఞ ఎంట్రీని బాలయ్య ప్లాన్‌ చేశారని టాక్‌ నడుస్తోంది. మరి ఈ వార్తలపై బాలయ్య, పూరి ఎలా స్పందిస్తారో చూద్దాం.

Advertisement
Advertisement
Advertisement