సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భజలాలపై అధ్యయనం

ABN , First Publish Date - 2021-02-26T06:06:42+05:30 IST

సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భజలాలపై అధ్యయనాలు చేస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం భూగర్భశాస్త్రం ఆచార్యులు వై.శ్రీ నివాసరావు అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భజలాలపై అధ్యయనం

నన్నయ జియాలజీ ఆచార్యులు శ్రీనివాసరావు 

దివాన్‌చెరువు, ఫిబ్రవరి 25: సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భజలాలపై అధ్యయనాలు చేస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం భూగర్భశాస్త్రం ఆచార్యులు వై.శ్రీ నివాసరావు అన్నారు. ఈ పరిశోధనా ఫలాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలోని వినిమయ లెక్చర్‌క్లబ్‌లో శ్రీనివా సరావు గురువారం భూగర్భజలాలకు సంబంధించి న కీల క అంశాలపై మాట్లాడారు. గృహ, వ్యవసాయ అవసరా లకు భూ జలాలు ఏఏ ప్రాంతాలలో ఏఏ స్థాయిలో ఉన్నా యనే వివరాలను జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ వ్యవస్థ ద్వారా తెలుసుకునే విధానాలను వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయో గిం చుకుని భూగర్భజ లాల పై అనేక పరిశోధనలు చేయ వచ్చునని చెప్పారు. ఉప కులపతి ఎం.జగన్నా థరావు మాట్లాడుతూ ఇటువంటి లెక్చర్‌ క్లబ్‌ల ద్వారా ఆయా విభాగాలలో నిష్ణాతులైన ఆచార్యుల విజ్ఞానం అందరి కీ అందుతుందని తెలిపారు. దీనిని అందరూ సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో ప్రిన్సిపాల్స్‌, డీన్స్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-26T06:06:42+05:30 IST