Advertisement
Advertisement
Abn logo
Advertisement

జైల్లో Teenmar Mallanna ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారా..!?

హైదరాబాద్ సిటీ/సైదాబాద్‌ : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న తీన్మార్‌ మల్లన్న  మంగళవారం సాయంత్రం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. బుధవారం ఉదయం జైలు నుంచి తీన్మార్‌ మల్లన్న ఆన్‌లైన్‌ ములాఖత్‌లో భార్యతో మాట్లాడిన సమయంలో పోలీసుల అక్రమ కేసులకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జైలు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ వివరణ ఇస్తూ నిరాహార దీక్ష చేపట్టడం వాస్తవం కాదని తెలిపారు.

తీన్మార్‌ మల్లన్నను విచారించిన పోలీసులు

జగద్గిరిగుట్ట పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో గతంలో తీన్మార్‌ మల్లన్నపై నమోదైన కేసులో బుధవారం వెబనార్‌ ద్వారా ఆయనను విచారించారు. కూన మహాలక్ష్మీనగర్‌కు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తికి గతంలో ప్లాట్‌ విషయంలో కార్పొరేటర్‌ జగన్‌ అనుచరుడు సంపత్‌రెడ్డికి మధ్య గొడవ జరిగింది. ఈవిషయంపై కార్పొరేటర్‌ వద్దకు వెంకటేశ్‌ వెళ్లినా న్యాయం జరగక పోవడంతో తీన్మార్‌ మల్లన్నను వెంకటేశ్‌ సంప్రదించాడు. ఈవిషయంలో సంపత్‌రెడ్డికి తీన్మార్‌ మల్లన్నకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో సంపత్‌రెడ్డి తీన్మార్‌ మల్లన్నపై కోర్టు ద్వారా కేసు నమోదు చేశాడు. ఈ కేసును బుధవారం పోలీసులు విచారించారు.

Advertisement
Advertisement