ఏపీ రాజధానిపై హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇవే..

ABN , First Publish Date - 2020-08-14T19:18:34+05:30 IST

రాజధానిపై రాష్ట్ర హైకోర్టు యథాతథ స్థితి విధించింది. ఈనెల 27 వరకు "స్టేటస్ కో"ను న్యాయస్థానం పొడిగించింది. కరోనా సమయంలో అంత ఎమర్జెన్సీ

ఏపీ రాజధానిపై హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇవే..

అమరావతి: రాజధానిపై రాష్ట్ర హైకోర్టు యథాతథ స్థితి విధించింది. ఈనెల 27 వరకు "స్టేటస్ కో"ను న్యాయస్థానం పొడిగించింది. కరోనా సమయంలో అంత ఎమర్జెన్సీ ఏముందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వానికి విధులు నిర్వర్తించాల్సిన అవసరముందని ప్రభుత్వం తరపు న్యాయవాది రాకేష్‌ త్రివేది వాదించారు. కేసును వాయిదా వేయండి కానీ.. స్టేటస్ కో పొడిగించవద్దని ఆయన హైకోర్టును కోరారు. స్టేటస్‌ కోతో క్యాంప్ కార్యాలయం తరలించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. వేరే కార్యాలయాలను తరలించుకోవాలన్నా కోర్టు ఉత్తర్వులు కూడా అడ్డంకిగా మారాయని విన్నవించారు. ‘స్టేటస్ కో’ ఉత్తర్వులతో చట్టాలను అమలు చేసే అవకాశం లేకుండా పోయిందని వాదించారు. ప్రభుత్వ వాదనను పిటిషనర్ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టాన్ని ఉల్లంఘించినందునే తాము స్టేటస్ కో అడిగామని, స్టేటస్ కో ఎత్తేయడానికి వీల్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. మూడు రాజధానుల ఏర్పాటు విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్ తరుఫు న్యాయవాది చెప్పుకొచ్చారు. విభజన చట్టంలో కేవలం ఒక్క రాజధాని ఏర్పాటు ప్రస్తావనే ఉందని, పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ‘స్టేటస్‌ కో’ను ఈనెల 27వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

Updated Date - 2020-08-14T19:18:34+05:30 IST