కరోనా భయంతో.. క్రికెట్లో కొత్త జాగ్రత్తలు

ABN , First Publish Date - 2020-07-09T01:34:15+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ కార్యకలాపాలన్నీ మూతపడ్డాయి.

కరోనా భయంతో.. క్రికెట్లో కొత్త జాగ్రత్తలు

లండన్: కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ కార్యకలాపాలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ క్రికెట్ ఆట మొదలవుతోంది. ఇంగ్లండ్-విండీస్ జట్ల మధ్య బుధవారం ప్రారంభమైన టెస్టు సిరీస్ కరోనాతో అటకెక్కిన క్రికెట్‌కు మళ్లీ నాంది పలుకుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్-విండీస్ టెస్టు మ్యాచులో కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. అవేంటంటే.. టాస్ సమయంలో కేవలం ఇరుజట్ల కెప్టెన్లు, అంపైర్ మాత్రమే వస్తారు. టాస్ వేయడాన్ని టెలికాస్ట్ చేయరు. ఆటగాళ్లెవరూ గ్లవ్స్, షర్ట్స్, వాటర్ బాటిల్స్, బ్యాగ్స్, స్వెటర్స్ ఏవీ ఇచ్చిపుచ్చుకోకూడదు. టీమ్ షీట్స్ కూడా డిజిటల్‌గానే సిద్ధం చేస్తారు. స్కోరర్లు కూడా పెన్నులుగానీ, పెన్సిల్స్‌గానీ షేర్ చేసుకోకూడదు. అలాగే ఆట మధ్యలో క్లీనింగ్ బ్రేక్స్ ఉంటాయి. ఆ సమయంలో వికెట్లను కూడా శానిటైజ్ చేస్తారు.

Updated Date - 2020-07-09T01:34:15+05:30 IST