ఆలస్యంగా నిద్రిస్తే పిల్లలకు స్థూలకాయం

ABN , First Publish Date - 2020-03-11T16:07:47+05:30 IST

ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లోనే శిశువులు రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారట!! చీకటిపడగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బుజ్జాయిలను

ఆలస్యంగా నిద్రిస్తే పిల్లలకు స్థూలకాయం

స్టాక్‌హోం, మార్చి 10 : ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లోనే శిశువులు రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారట!! చీకటిపడగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బుజ్జాయిలను తల్లులు నిద్రపుచ్చే దేశాల జాబితాలో న్యూజిలాండ్‌(7.28 గం), ఆస్ట్రేలియా(7.43 గం), బ్రిటన్‌(7.55 గం) తొలి మూడుస్థానాల్లో ఉన్నాయని స్వీడన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక పిల్లలు పెద్దవాళ్లలా ఆలస్యంగా నిద్రిస్తున్న పరిస్థితి హాంకాంగ్‌ (10.17గం), భారత్‌ (10.11 గం), తైవాన్‌ (10.09 గం), దక్షిణ కొరియా(10.06 గం)ల్లో నెలకొందన్నారు. ఆరేళ్లలోపు శిశువులు ఈవిధంగా ఆలస్యంగా నిద్రిస్తే స్థూలకాయం(ఒబెసిటీ) ముప్పు ముసురుకునే అవకాశాలు ఎక్కువని హెచ్చరించారు. 107 మంది ఆరేళ్లలోపు పిల్లలపై అధ్యయనం జరపగా, రోజూ రాత్రి 9 గంటల తర్వాత నిద్రించినవారి శరీర బరువు పరిమితికి మించి పెరిగినట్లు గుర్తించారు. 

Updated Date - 2020-03-11T16:07:47+05:30 IST