సికింద్రాబాద్‌లో అర్థరాత్రి బైక్ రేసింగ్‌లు

ABN , First Publish Date - 2022-03-02T23:50:07+05:30 IST

నగరంలో అర్ధరాత్రి సమయంలో బైక్ రేసింగ్‌లకు యువకులు

సికింద్రాబాద్‌లో అర్థరాత్రి బైక్ రేసింగ్‌లు

సికింద్రాబాద్‌: నగరంలో అర్ధరాత్రి సమయంలో బైక్ రేసింగ్‌లకు యువకులు పాల్పడుతున్నారు. కొంతమంది యువకులు సోషల్ మీడియాలో లైక్‌ల కోసం బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. ఈ రేసింగ్‌లను అర్థ రాత్రి సమయంలో చేస్తారు. యువకులు బైక్ రేసింగ్ నిర్వహించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఎనిమిది మంది యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మంది కలిసి అర్ధరాత్రి సమయంలో బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. బైక్ రేసింగ్ నిర్వహిస్తుంటే ఒకరు వీడియో తీస్తున్నారు. ఈ వీడియోలన్నిటిని సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో యువకులు అప్లోడ్ చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-03-02T23:50:07+05:30 IST