ఎన్‌పీఎ్‌సకు ఆలస్యంగా జమ

ABN , First Publish Date - 2020-09-25T08:51:31+05:30 IST

ఉద్యోగుల జీతం నుంచి పెన్షన్‌ కోసం తీసుకున్న డబ్బును జాతీయ పెన్షన్‌ వ్యవస్థ ట్రస్టుకు జమ చేయడంలో ఏపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర

ఎన్‌పీఎ్‌సకు ఆలస్యంగా జమ

ఏపీ ప్రభుత్వంతోపాటు స్వయం ప్రతిపత్తి సంస్థలదీ అదే తీరు: కాగ్‌


న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి: ఉద్యోగుల జీతం నుంచి పెన్షన్‌ కోసం తీసుకున్న డబ్బును జాతీయ పెన్షన్‌ వ్యవస్థ ట్రస్టుకు జమ చేయడంలో ఏపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు పలు సందర్భాల్లో జాప్యం చేస్తున్నాయని కాగ్‌ నివేదిక వెల్లడించింది. ఎన్‌పీఎస్‌ పనితీరుపై అధ్యయనం చేసి కాగ్‌ రూపొందించిన నివేదికను కేంద్రప్రభుత్వం పార్లమెంటుకు అందించింది.


నవంబరు 2018నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ ట్రస్టుకు రూ.325.06 కోట్లు జమ చేయలేదు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రూ.50.8కోట్లు, 2011-18వరకు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ రూ.19.72లక్షలు జమ చేయలేదు. టీటీడీ 5నెలల ఆలస్యంతో సెప్టెంబరు 2015లో రూ.44.77కోట్లు జమ చేసింది.


దాదాపు రెండేళ్ల ఆలస్యంతో ఆర్‌జేయూకేటీ 2018 ఏప్రిల్‌లో రూ.కోటి చెల్లించింది. సంబంధిత దస్త్రాలు అప్‌లోడ్‌ చేయడంలో ఇబ్బందులు, ఎన్‌పీఎస్‌ గ్రాంట్స్‌, మానవవనరుల లేమితో జాప్యం జరుగుతోందని కాగ్‌ తేల్చింది. 


Updated Date - 2020-09-25T08:51:31+05:30 IST