Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 21 Jan 2022 10:44:19 IST

సుశాంత్ సింగ్ పుట్టిన రోజున ఫ్యాన్స్ వీడియో.. ఎమోషనల్ అయిన సోదరి

twitter-iconwatsapp-iconfb-icon
సుశాంత్ సింగ్ పుట్టిన రోజున ఫ్యాన్స్ వీడియో.. ఎమోషనల్ అయిన సోదరి

హిందీ సినీ పరిశ్రమలో ఎలాంటి సపోర్టు లేకుండా ఎదిగిన నటుల్లో ఒకరు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ని ప్రారంభించిన ఈ నటుడు ‘ఎమ్‌ఎస్ ధోని’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించాడు. అయితే 2020లో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. 


అప్పటి నుంచి ఏదో సందర్భంలో సుశాంత్‌ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు. జనవరి 21 ఈయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో సుశాంత్ ఫ్యాన్స్ రెడీ చేసిన ఓ వీడియోని షేర్ చేసింది సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తీ.


ఆ వీడియోకి.. ‘ఎంతో అందంగా చేశారు. సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ కలలను నేరవేర్చడానికి మేము ప్రయత్నిస్తాం. నీ వారసత్వం కొనసాగుతుంది. ప్రో టీమ్‌కి ధన్యవాదాలు, మీరు అద్భుతమైన పని చేశార’ని ఎంతో ఎమోషనల్‌గా క్యాప్షన్ రాసుకొచ్చింది.


శ్వేత ఈ వీడియోని షేర్ చేసిన కొద్ది సేపటికే వైరల్‌గా మారిపోయింది. దీంతో ఎంతోమంది ఫ్యాన్స్ తమ అభిమాన నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...