‘‘ఒక్క రోజే’’ బడికెళ్లి.. కోపంతో ఇంటికొచ్చేసి

ABN , First Publish Date - 2022-02-07T17:48:34+05:30 IST

ప్రశాంతమూర్తిలా కనిపించే లతాజీకీ ఓసారి కోపమొచ్చింది. అది కూడా ఒక్క రోజే బడికి వెళ్లి.. మళ్లీ పాఠశాల ముఖం చూడనంతగా. సాంగ్లీలో లతా వాళ్ల ఇంటి ముందే మరాఠీ పాఠశాల ఉండేది.....

‘‘ఒక్క రోజే’’ బడికెళ్లి.. కోపంతో ఇంటికొచ్చేసి

ప్రశాంతమూర్తిలా కనిపించే లతాజీకీ ఓసారి కోపమొచ్చింది. అది కూడా ఒక్క రోజే బడికి వెళ్లి.. మళ్లీ పాఠశాల ముఖం చూడనంతగా. సాంగ్లీలో లతా వాళ్ల ఇంటి ముందే మరాఠీ పాఠశాల ఉండేది. అందులో చదివే సమీప బంధువు వాసంతితో పాటు లత కూడా వెళ్లేవారు. అలా ఆమె కూడా పాఠశాలలో చేరారు. అయితే, మొదటి రోజే చెల్లెలు, మరో ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే (అప్పటికి పది నెలల వయసు)ను తీసుకుని వెళ్లి, ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠం వినసాగారు.


ఉపాధ్యాయిని అభ్యంతరం చెప్పడంతో లతాకు ఆగ్రహంగా బయటకొచ్చేశారు. ఇంట్లో పనిచేసే విఠల్‌ను అడిగి మరాఠీ అక్షరమాల, ప్రాథమికంగా చదవడం, రాయడం ఎలాగో తెలుసుకున్నారు. సమీప బంధువు ఇందిరా, లేఖరాజ్‌ శర్మ అనే వ్యక్తి ద్వారా హిందీ నేర్చుకున్నారు. ఏ భాష పాట అయినా.. హిందీలోనే రాసుకునేవారు.

Updated Date - 2022-02-07T17:48:34+05:30 IST