మళ్లీ వెంటిలేటర్‌పై లతా మంగేష్కర్

ABN , First Publish Date - 2022-02-05T20:19:58+05:30 IST

ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి..

మళ్లీ వెంటిలేటర్‌పై లతా మంగేష్కర్

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి 'విషమం'గా ఉందని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ ప్రతిత్ సంధాని సారథ్యంలో వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. గత నెలలో కోవిడ్ బారిన పడటంతో లతామంగేష్కర్‌ను ఆసుపత్రిలో చేర్చారు.


కాగా, ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఎప్పటికప్పడు ట్వీట్ల ద్వారా అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ వారం మొదట్లో కూడా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, ఐసీయూలోనే కొనసాగుతున్నారని ఒక ట్వీట్ చేశారు. దీదీ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకోకుండా వదంతులు సృష్టించవద్దని ఆ ట్వీట్‌లో కుటుంబ సభ్యులు కోరారు. మరోవైపు, లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయాభిలాషులు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2022-02-05T20:19:58+05:30 IST