చివరికి చేరని నీరు

ABN , First Publish Date - 2021-02-27T07:08:50+05:30 IST

రబీ వరిసాగు చిరు పొట్ట దశలో ఉంది. ఈ దశలో నీటి తడులు లేకపోతే దిగుబడులు తగ్గిపోతా యని రైతులు ఆందోళన చెందుతున్నారు.

చివరికి చేరని నీరు
సామర్లకోట లాకుల వద్ద గోదావరి కాలువలో తగ్గిన నీరు

రబీ వరి సాగుకు ఎంత కష్టం

 తూర్పుడెల్టా కాల్వకు నీటిఎద్దడి

 శివారు ప్రాంతాలకు నీరు అంతంత మాత్రం

 మరో 30 రోజులు గడ్డుకాలం

సామర్లకోట, ఫిబ్రవరి 26: రబీ వరిసాగు చిరు పొట్ట దశలో ఉంది. ఈ దశలో నీటి తడులు లేకపోతే దిగుబడులు తగ్గిపోతా యని రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పు డెల్టా కాల్వ పరిధిలో సామర్లకోట మండలం శివారు ప్రాంతాలకు మాత్రమే కాకుండా సామర్లకోట గోదావరి కాల్వ నుంచి 42 వేల ఎకరాలకు సాగునీరందించే పిఠాపురం బ్రాంచి కెనాల్‌కు పూర్తి స్థాయిలో సాగునీరందడం లేదు. దీంతో సుమారు 24 వేల ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు ఉన్నట్టు రైతు వర్గాలు చెబుతున్నాయి. ఇక సాగునీరు అందించడానికి నీటిపారుదల అధికారులు ఇప్ప టికే అపసోపాలు పడుతున్నారు. దీనికంతకూ ప్రధాన కారణం గోదావరిలో నీటి లభ్యత పడిపోవడమే. సీలేరు జలాల మీదే అధికార యంత్రాంగం ఆధారపడింది. ప్రస్తుతం గోదావరిలో నీటి ప్రవాహం 1150 క్యూసెక్యులకు పడిపోయింది. సీలేరు జలా శయం నుంచి 5100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం మీద ఉభయగోదావరి జిల్లాల డెల్టా ప్రాంతాలకు 6500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ఇరిగేషన్‌ అదికారులు చెబుతున్నప్పటికీ వాస్తవరూపంలో 6200 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నట్టు సమాచారం. గత మూడు రోజు లుగా నీటి విడుదల మరింత దయనీయంగా మారడంతో సామ ర్లకోట లాకులు నుంచి పీబీసీ కెనాల్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అదే కాలువలో ఏలేరు కాల్వ నుంచి మురుగు నీరు తిరిగి గోదావరి కాల్వలోకి ప్రవహించడంతో గోదావరి జలాలు కాలుష్య జలాలుగా మారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక తూర్పు డెల్టా కాలువకు 3100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ఇరిగేషన్‌ అధికారులు చెబు తున్నా వాస్తవ పరిస్థితుల్లో 300 క్యూసెక్కులు విడుదల అయ్యే పరిస్థితి లేదని రైతులు వాపోతు న్నారు. వంతుల వారీగా నీరు అందిస్తున్నా శివారు ప్రాంతాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. గడిచిన వారం రోజుల నుంచి నీటి సమస్య తీవ్రరూపం దాల్చుతూ శనివారం నుంచీ మూడు రోజులుగా మరింత దారుణంగా మారిందని రైతులు చెబుతున్నారు.. సామర్లకోట మం డలంలోని సుమారు ఏడు గ్రామాలతోపాటు మండలంలోని పెదబ్రహ్మదేవం, వేట్లపాలెం, దోమాడ ఎత్తిపోతల పథకాలకూ సాగునీరందడం లేదన్న ఫిర్యాదులు రైతుల నుంచి వస్తున్నాయి. ఇక పిఠాపురం బ్రాంచి కెనాల్‌ ఆయకట్టులో సుమారు 8వ ేల ఎకరాలకు సాగునీరందడం లేదని రైతులు గగ్గోలు పెడ్తున్నారు. మరికొంత మంది రైతులు గోదావరి కాలువ వెంబడి, పీబీసీ కాలువ వెంబడి ఆయిల్‌ ఇంజన్లను వినియోగిస్తూ నీటిని పంపింగ్‌ చేసుకోవడం ద్వారా ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుందని పలువురు రైతులు వాపోతున్నారు. సామర్లకోట నుంచి జి.మేడపాడు వరకూ అయిదు కిలోమీటర్ల పొడవునా సుమారు 15 ఆయిల్‌ ఇంజన్లను రైతులు ఏర్పాటు చేసుకోవాల్సిరావడం అత్యంత విచారకరమని వాపోతున్నారు. కాలువలో నీటిమట్టం పడిపోవ డంతో మెరక ప్రాంతాలకు నీరందడంలేదు. గతంలో ఇటువంటి పరిస్ధితులు ఎదురైనపుడు రైతులు డ్రెయిన్లలో నీటిని తోడుకునేవారు. ప్రభుత్వమే ఆయిల్‌ ఇంజన్లను ఏర్పాటుచేసేది. ఇప్పు డు డ్రెయిన్లలోనూ నీరు అందని పరిస్దితి. ఇటీవల జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కెఎస్వీ ప్రసాద్‌ సైతం సామర్లకోట నుంచి పెదబ్రహ్మదేవం వరకూ కాలువలో నీటి పరిస్ధితిని  పరిశీలించి నీటిమట్టం పెంచాల్సిన ఆవశ్యకతపై ఇరిగేషన్‌ అధికారులతో చర్చించారు. మరోపక్క కాలువలో గుర్రపుడెక్క, తూటికాడ అవరోధాల కారణంగా నీటి ప్రవాహనికి పెద్ద అవరోధంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. తూర్పు డెల్టా కాల్వకు లస్కర్ల కొరత వెంటాడుతోంది. ప్రభు త్వం నుంచి నిధులు విడుదల కాకపోవ డంతో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేకపో తున్నారు. ఉన్న సిబ్బందికి ప్రభుత్వం సకాలంలో వేతనాలు మంజూరు చేయడం లేదు. ఈ ప్రభా వం సాగునీటి సరఫరాపైనా పడుతోంది. ఒకపక్క పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, పొట్ట దశలో ఉన్న వరిపంటకు నీటితడులు అధికంగా కావాల్సిరావడంతో ప్రభుత్వం సకాలంలో స్పం దించాల్సిఉంది. సామర్లకోట మండలంలోని గ్రామాలతోపాటు సర్పవరం పరిధిలోని గ్రామాలకు సంబంధించిన ఉండూరు ఛానల్‌, రమణయ్యపేట ఛానెల్‌ల ద్వారా, ఏలేరు కాలువ ద్వారా అయి నా సాగునీరు ఇప్పించాలని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబుకు శుక్రవారం రైతులు  వినతిపత్రం అందజేశారు. రైతు ప్రతినిధులు కొప్పిరెడ్డి రాధాకృష్ణ, జ్యోతుల ప్రభాకరరావు, వెన్నపు కాశీవిశ్వనాఽథం, బసవా గంగరాజు, సామర్లకోట రైతులు ఉన్నారు.




Updated Date - 2021-02-27T07:08:50+05:30 IST