అయిన వారున్నా... అన్నీ తానై... కరోనా మృతునికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-08-13T21:04:04+05:30 IST

ఎందరో బంధువులు, మరెందరో స్నేహితులున్నా కరోనా మహ మ్మారితో మృతిచెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ తరుణంలో కరోనా వ్యాధితో

అయిన వారున్నా... అన్నీ తానై... కరోనా మృతునికి అంత్యక్రియలు

కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించిన కాంపెల్లి

మండల, పట్టణ పరిధిలో తాను అంత్యక్రియలు నిర్వహిస్తానంటూ ముందుకు 


పాల్వంచ టౌన్‌(ఖమ్మం): ఎందరో బంధువులు, మరెందరో స్నేహితులున్నా కరోనా మహ మ్మారితో మృతిచెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ తరుణంలో కరోనా వ్యాధితో మృతిచెందిన వ్యక్తికి అన్నీతానయ్యారు పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్‌. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం కోవిడ్‌ మృతదేహాల అంత్యక్రియల బాధ్యత తీసుకుంటానని ప్రకటించుకున్నారు. అన్న మాట ప్రకారం పాల్వంచ పట్టణం రాంనగర్‌కు చెందిన వ్యక్తి కొవిడ్‌ బారిన పడ్డాడు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది. మంగళవారం మెరుగైన చికిత్సకై హై దరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతుడి బంధువులు కనకేష్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించి తన మిత్రులు విశ్వేశ్వరరావు, సత్యనారాయణ, ఎస్‌కే. సాబీర్‌పాషా, వి. పూర్ణ, చింతనాగరాజు, బి. పూర్ణ తదితరులు పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 


కోవిడ్‌ మృతుల దహన సంస్కారాలకు ఫోన్‌ చేయండి : కాంపెల్లి కనకేష్‌, పాల్వంచ సొసైటీకి ఉపాధ్యక్షులు

పట్టణ, మండల పరిధిలో కోవిడ్‌ వైరస్‌తో చనిపోయిన వారి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉన్న ఎవరైనా నాకు ఫోన్‌ చేయండి. కరోనా వైరస్‌ వల్ల కలిగే మరణాలు, ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు సైతం భయపడుతున్న తీరు నన్ను కలచివేసింది. 7599988888 నెంబర్‌లో తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-13T21:04:04+05:30 IST