Abn logo
Oct 2 2020 @ 03:31AM

లారీ ఢీకొని మహిళకు గాయాలు

రావులపాలెం రూరల్‌, అక్టోబరు 1: లారీ ఢీకొని ఒక మహిళకు గాయాలైన సంఘటనపై రావులపాలెం పోలీసులు కేసునమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రావులపాడుకు చెందిన అంబటి పుష్పావతి గతనెల 30వ తేదీన నిత్యావసరాలు తెచ్చుకునేందుకు నడుచుకుని వెళ్తుండగా స్థానిక హాస్పటల్స్‌సెంటర్‌ వద్దకు వచ్చేసరికి వెనుకనుంచి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.బుజ్జిబాబు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement